Secunderabad | శరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు
Secunderabad Railway Station Redevelopment | విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.700 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి పనులు ఏప్రిల్ 2023లో ప్రారంభమయ్యాయి. 2025 చివరి నాటికి అభివృద్ధిపనులుపూర్తిచేసి సికింద్రాబాద్ జంక్షన్ ను అత్యాధునిక సౌకర్యాలతో సుందరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రయాణీకుల రాకపోకలకు అంతరాయం కలగకుండా నిర్మాణ కార్యకలాపాలను సులభంగా కొనసాగించేందుకు ఉత్తరం వైపున ఉన్న బుకింగ్ కార్యాలయం స్థానంలో తాత్కాలిక బుకింగ్ కార్యాలయం నిర్మించారు. కాగా కొత్త రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) భవనం, స్ట్రక్చరల్, ప్లంబింగ్ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు, ఫౌండేషన్, సివిల్ ఫ్రేమ్ వర్క్‌తో సహా ఇతర పునర్నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణం వైపున, పునాదులకు సంబంధించిన ప్రధాన పనులు పూర్తికాగా, బేస్‌మెంట్-1, బేస్‌మెంట్-2 స్లాబ్ పనులు పూర్తయ్యాయి.
దక్షిణం వైపున ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ బయటకు వెళ్లే ప్రయాణీకులకు డ్రాప్-ఆఫ్ జోన్‌గా ఉంటుంది, అయితే బేస్‌మెంట్ -1 ఈ వైపు వచ్చే ప్రయాణికులకు పికప్ జోన్‌గా ఉంటుంది. అండర్ గ్రౌండ్ – 2 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది ఇందులో దాదాపు 200 ఫోర్ వీలర్ వాహనాలను పార్క్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఉత్తరం వైపున, మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ (ఎమ్‌ఎల్‌సిపి) నిర్మాణం కోసం ఆరు అంతస్తులలో సౌకర్యాన్ని విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయి. కాజీపేటలో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత రైల్వే స్టేషన్‌లో మొత్తం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్‌లు ఉంటాయి. తూర్పు, పశ్చిమ మెట్రో స్టేషన్‌లతో పాటు బస్ స్టేషన్‌లకు మల్టీ-మోడల్ కనెక్టివిటీ అందించనున్నారు. అలాగే , స్టేషన్‌లో విశాలమైన రూఫ్ ప్లాజా, ఫలహారశాలలు, వినోద సౌకర్యాలు, ప్రధానంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే రిటైల్ దుకాణాలు ఉంటాయి.
Secunderabad Railway Station అభివృద్ధిలో కీలక అంశాలు..
- విశాలమైన రూఫ్ ప్లాజా/కాన్కోర్స్.
- ఒకే చోట అన్ని సౌకర్యాలు – రిటైల్, ఫలహారశాలలు, వినోదం
- సాఫీగా ఉండే ట్రాఫిక్, తగిన పార్కింగ్ సౌకర్యాలు
- స్టేషన్ లోకి వచ్చే ప్రయాణికులు, బయటకు వెళ్లే ప్రయాణికుల విభజన
- పూర్తిగా కవర్ ప్లాట్‌ఫారమ్‌లు, ట్రాక్‌లు
- 26 లిఫ్టులు, 2 ట్రావెలేటర్లు, 32 ఎస్కలేటర్లు
- వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు
- సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్స్
- సౌర శక్తి, నీటి సంరక్షణ/రీసైక్లింగ్
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..