Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Goa Train | సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం  

Spread the love

Secunderabad-Goa Train | గోవా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్ – వాస్కోడిగామా (గోవా) – సికింద్రాబాద్‌ మధ్య కొత్తగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కొత్త రైలును అక్టోబ‌ర్‌ 6న ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
సికింద్రాబాద్‌ – వాస్కోడగామా (07039) వన్‌ వే స్పెషల్‌ రైలును ఉదయం 11.45 గంటలకు ప్రారంభించనుందిజ ఈ నెల 9 నుంచి రెగ్యులర్‌ సేవలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని సౌత్‌సెంట్ర‌ల్ రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా (17039) రైలు ప్రతీ బుధవారం, శుక్రవారాల్లో సేవ‌లందించ‌నుంద‌ని, ఇక తిరుగు ప్ర‌యాణంలో వాస్కోడిగామా – సికింద్రాబాద్‌ (17040) రైలు గురువారం, శనివారాల్లో న‌డుస్తుంద‌ని చెప్పింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉదయం 10.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.45 గంటలకు వాస్కోడిగామాకు చేరుకుంటుందని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పేర్కొంది.

Secunderabad-Goa Train హాల్టింగ్స్‌

వాస్కోడిగామా – సికింద్రాబాద్ రైలు కాచిగూడ, షాదర్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల, కర్నూల్‌ సిటీ, డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్‌పేట్‌, కొప్పల్‌, గదడ్‌, హుబ్బలి, దర్వాడ్‌, లోండా, మడగాన్‌ మీదుగా వాస్కోడిమాకు చేరుకుంటుంది. రైలులో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని ద‌క్షిణ మ‌ధ్య‌ రైల్వే వెల్ల‌డించింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *