SCR Special Trains | సికింద్రారాబాద్ – కటక్ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు..
SCR Special Trains | సికింద్రాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ , ఒడిశాలోని కటక్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ – కటక్ మధ్య రాకపోకల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.
ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ఇదే..
SCR Special Trains From Secundrabad : ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 18వ తేదీ వరకు ప్రతి మంగళ, బుధవారాలలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ రైళ్లు బయలుదేరే సమయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
- హైదరాబాద్ – కటక్ (07165) రైలు మంగళవారం,
- కటక్ -హైదరాబాద్ (07166) రైలు బుధవారం
హాల్టింగ్ స్టేషన్లు..
సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బెర్హంపుర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.