Save Hindu in Bangladesh | బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు ఆగడం లేదు. హిందూ ఆలయాల ధ్వంసం ఉదంతాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో ఇవి మరింత జోరందుకున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న 27 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశామని హలువఘాట్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి (OC) అబుల్ ఖయేర్ ఈ రోజు వెల్లడించారు.
హిందువులే లక్ష్యంగా…
గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున రెండు ఆలయాల్లో మూడు విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలను లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇలాంటి వరుస ఘటనలు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. నవంబరు 29న చట్గ్రామ్‌లో మూడు ఆలయాలను దండగులు ధ్వంసం చేశారు. ఈ దాడులను కోట్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ధృవీకరించారు. దుండగులు హింసను ప్రేరేపించడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
సంతానేశ్వర్ మాతృ ఆలయ నిర్వాహక కమిటీ శాశ్వత సభ్యుడు తపన్ దాస్ మాట్లాడుతూ ఈ దాడులకు ముందు పెద్ద సంఖ్యలో చేరిన దుండగులు హిందూ పౌరులు, ISKCON వ్యతిరేక నినాదాలు చేశారని తెలిపారు.
హిందూ మత సంఘం సభ్యుడి అరెస్టు
Save Hindu in Bangladesh : హిందూ మత సంఘం ( ISKCON ) సభ్యుడు చిన్మయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) అరెస్టు అనంతరం కొనసాగుతున్న ఆందోళనల తర్వాత ఈ దాడులు పెరిగాయని పరిశీలకులు అంటున్నారు. చిన్మయ్ కృష్ణ దాస్‌ను నవంబరు 25న ఢాకా హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమాన పర్చారని ఆయనపై ప్రధాన ఆరోపణ. దీంతో చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు చేయగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో వాతావరణం ఉద్రిక్తతగా మారింది.
దౌత్య సంబంధాలకు విఘాతం
ఆగస్టు 5న బంగ్లాదేశ్ పౌరులు అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడంతో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బంగ్లాదేశక్ష ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇవి ఆ దేశంలోని మైనారిటీ హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలకు ఈ వరుస ఘటనలు విఘాతం కలిగిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..