Friday, April 18Welcome to Vandebhaarath

Samsung Crystal 4k TV | తక్కువ ధరలోనే హైటెక్ ఫీచర్లతో శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలు వచ్చేశాయి.. వీటి ధరలు

Spread the love

Samsung Crystal 4K TV Series : భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన Samsung కంపెనీ..  Crystal 4K Vivid స్మార్ట్ టీవీ సిరిస్ ను లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధ‌ర రూ. 32,990. అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, 18 నెలల వరకు నో కాస్ట్ EMIతో ఈ స్మార్ట్ టీవీల‌ను విడుదల చేసింది. 2024 క్రిస్టల్ 4K TV లైనప్ 4K అప్‌స్కేలింగ్, సోలార్ సెల్ రిమోట్, మల్టీ-వాయిస్ అసిస్టెంట్, Q-సింఫనీ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో, క్రిస్టల్ ప్రాసెసర్ 4K తో వస్తుంది.

కొత్త క్రిస్టల్ 4కె వివిడ్, క్రిస్టల్ 4కె విజన్ ప్రో, క్రిస్టల్ 4కె వివిడ్ ప్రో టీవీ సిరీస్‌లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల‌తోపాటు Samsung.comలో 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాలు, 75-అంగుళాల స్క్రీన్‌ల ప‌రిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి.

2024 క్రిస్టల్ 4K TV సిరీస్ శామ్‌సంగ్ టీవీ ప్లస్ ఆన్‌బోర్డింగ్‌తో కూడిన అంతర్నిర్మిత IoT హబ్ వంటి ఫీచర్లతో కూడా వస్తుంది. అంతర్నిర్మిత మల్టీ-వాయిస్ అసిస్టెంట్ Bixby లేదా Amazon Alexaని ఉపయోగించి టీవీకి క‌మాండ్స్ ఇవ్వొచ్చు.

READ MORE  Tri-Fold Phone : సాంసంగ్ నుంచి ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్..

2024 క్రిస్టల్ 4K TV సిరీస్ 4K అప్‌స్కేలింగ్ ఫీచర్‌తో పనిచేస్తుంది. ఇది తక్కువ-రిజల్యూషన్ కంటెంట్ ను కూడా  4K డిస్‌ప్లే అధిక రిజల్యూషన్‌తో ప్రదర్శిస్తుంది.  లైఫ్‌లైక్ 4K చిత్ర నాణ్యతను అందిస్తుంది. వన్ బిలియన్ ట్రూ కలర్స్ – PurColor, క్రిస్టల్ ప్రాసెసర్ 4K & HDR10+  బ్రైట్ నెస్ తో  వినియోగదారులు ఇప్పుడు రిచ్ డార్క్‌తో మెరుగైన కాంట్రాస్ట్‌ను ఆస్వాదించవచ్చు.

అద్భుతమైన వీక్షణ అనుభవం కోసం, క్రిస్టల్ 4K TV సిరీస్ OTS లైట్‌ని కలిగి ఉంది. ఇది వినియోగదారులకు ఆన్-స్క్రీన్ నిజమైనదిగా భావించేలా చేస్తుంది. 3D సరౌండ్ సౌండ్‌తో రెండు వర్చువల్ స్పీకర్‌లతో వస్తుంది.   2024 క్రిస్టల్ 4K TV సిరీస్ స్మార్ట్ హబ్‌ను కూడా కలిగి ఉంది. ఇది స్మార్ట్ హోమ్ అనుభవానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇది వినోదం, యాంబియంట్ మరియు గేమింగ్ ఆప్షన్‌లను కలిపి అందిస్తుంది. ఇది భారతదేశంలో 100 ఛానెల్‌లతో కూడిన Samsung TV ప్లస్ సర్వీస్ తో కూడా వస్తుంది.

4K అప్‌స్కేలింగ్

4K అప్‌స్కేలింగ్ ఫీచర్..  వినియోగదారులు వారు చూడాలనుకుంటున్న కంటెంట్  గరిష్టంగా 4K రిజల్యూషన్‌ను లో కనిపించేలా చేస్తుంది. ఈ ఫీచర్ టీవీ టెక్నాలజీలో సరికొత్త పురోగతిగా చెప్పవచ్చు. వీక్షకులు వారు చూస్తున్న కంటెంట్ రిజల్యూషన్‌తో సంబంధం లేకుండా హై రిజల్యూషన్ తో చూసేందుకు వీలు కల్పిస్తుంది.

READ MORE  రోజుకు 2GB డేటాతో జియో నుంచి చవకైన ప్లాన్

సోలార్ సెల్ రిమోట్ : సోలార్ సెల్ రిమోట్‌ని ఇండోర్ రూమ్ లైట్ల ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు. ఈ రిమోట్ కు డిస్పోజబుల్ బ్యాటరీల అవసరం ఏమాత్రం ఉండదు.

మల్టీ-వాయిస్ అసిస్టెంట్ : కొత్త టీవీలు Bixby లేదా Amazon Alexaతో సులభంగా కంట్రోల్ చేయవచ్చు. రెండూ అంతర్నిర్మితమై ఉన్నాయి.

క్రిస్టల్ ప్రాసెసర్ 4K :  పవర్ ఫుల్  క్రిస్టల్ ప్రాసెసర్ 4K 16-బిట్ 3D కలర్ మ్యాపింగ్ అల్గారిథమ్‌తో కలర్స్ కు సంబంధించి ప్రతి షేడ్‌ను ఖచ్చితంగా మ్యాప్ చేస్తుంది. ఇది వివిధ డేటాను విశ్లేషించి లైఫ్‌లైక్ 4K రిజల్యూషన్ కోసం చిత్రాన్ని కస్టొమైజ్ అడాప్టివ్ 4K అప్‌స్కేలింగ్ విధానాన్ని అనుసరిస్తుంది.

OTS లైట్ : OTS లైట్ (ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్) రెండు వర్చువల్ టాప్ స్పీకర్‌లను  కలిగి ఉంటుంది. ఇది ఆన్-స్క్రీన్ ఎలిమెంట్స్  కదలికను ట్రాక్ చేసే ఆబ్జెక్ట్-ట్రాకింగ్ సౌండ్‌ని కలిగి ఉంది. మల్టీ-ఛానల్ స్పీకర్‌లను ఉపయోగించి కంటెంట్‌కు సరిపోలే స్థానాల్లో ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది, తద్వారా డాల్బీ డిజిటల్ ప్లస్‌తో డైనమిక్ 3D-వంటి సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది.

READ MORE  Bsnl Recharge | బిఎస్ఎన్ఎల్ నుంచి అతి త‌క్కువ ధ‌ర‌లో రెండు నెల‌వారీ రీఛార్జ్ ప్లాన్‌లు.. వివరాలు ఇవే..

గేమింగ్ ఫీచర్లు : 2024 క్రిస్టల్ 4K టీవీ సిరీస్ ఆటో గేమ్ మోడ్,  మోషన్ ఎక్స్‌లరేటర్‌తో వస్తుంది. ఇది చక్కని గేమింగ్ అనుభవం కోసం వేగవంతమైన ఫ్రేమ్ ట్రాన్సిషన్ అందిస్తుంది.

Samsung Crystal 4K TV ధర : Crystal 4K Vivid సిరీస్ రూ. 32,990 నుండి ప్రారంభమవుతుంది. అయితే క్రిస్టల్ 4కె విజన్ ప్రో సిరీస్ రూ. 34,490 నుండి , అలాాాాగే క్రిస్టల్ 4కె వివిడ్ ప్రో సిరీస్ రూ.35,990 నుండి లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీలు Samsung.com, Amazon.in , Flipkart.com అంతటా అందుబాటులో ఉంటాయి.


Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *