Sambhal violence : సంభాల్ హింసాకాండలో 27 మందిని అరెస్టు చేశామని, పురాతన మసీదుపై భారత పురావస్తు సర్వే (ASI) సర్వేపై రాళ్లు రువ్వడం.. రాళ్లదాడి ఘటన తర్వాత ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు చర్యలుచేపట్టినట్లు ఆంజనేయ కుమార్ సింగ్ ప్రకటించారు.
“ఇప్పటి వరకు, 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 22 మంది పేర్లను నమోదు చేశాం. 27 మందిని అరెస్టు చేశారు. ఇంకా 74 మందిని గుర్తించాం. ఇతర నిందితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. పరిస్థితిని సాధారణీకరించడమే మా లక్ష్యం. బయటి వ్యక్తుల ప్రభావానికి లోనుకాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు నిరాధారమైన ప్రకటనలు చేయడం మానుకోవాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కోరారు.
“ప్రజలు కేవలం దర్యాప్తు కోసం మాత్రమే కాకుండా, పరిస్థితిని సాధారణీకరించడానికి కూడా సహకరిస్తున్నారు… మేము సాక్ష్యాలను సేకరిస్తున్నాము, దాని ఆధారంగా తదుపరి చర్యను చేపడతాం.. నిరాధారమైన ప్రకటనలు చేయొద్దు. త్వరలోనే పరిస్థితులు సాధారణమవుతాయని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
అంతకుముందు, సంభాల్ ఘటనలో నిందితుల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారని సోమవారం ధృవీకరించిన సింగ్, హింస జరిగిన ప్రదేశంలో ఇప్పుడు పరిస్థితి శాంతియుతంగా ఉందని, దర్యాప్తు జరుగుతోందని ఆయన హామీ ఇచ్చారు. .
“సంభాల్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. దర్యాప్తు జరుగుతోంది. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే కుమారుడిపై ప్రమేయంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. హింసాకాండలో నలుగురు మరణించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే NSA కూడా రంగంలోకి దిగుతుంది. ”అని మొరాదాబాద్ పోలీసు కమిషనర్ చెప్పారు.
కాగా ఇదే విలేకరుల సమావేశంలో, సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ మాట్లాడుతూ.. సంభాల్ హింస తర్వాత 800 మందిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హింసాకాండకు ప్రేరేపించినందుకు జియా ఉర్ రెహ్మాన్ బార్క్, సోహైల్ ఇక్బాల్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ బిష్ణోయ్ తెలిపారు.
మీడియాను ఉద్దేశించి ఎస్పీ బిష్ణోయ్ మాట్లాడుతూ, “నిన్న గాయపడిన మా సబ్ ఇన్‌స్పెక్టర్ దీపక్ రాఠి 800 మందిపై ఫిర్యాదు చేశారు. జియా ఉర్ రెహ్మాన్ బార్క్, సోహైల్ ఇక్బాల్‌లపై ఆరోపణలు ఉన్నాయి. వారు ఆకతాయిలను ప్రేరేపించారని చెప్పారు. బార్క్‌కు ముందే నోటీసు ఇచ్చారు. అతను ఇంతకుముందు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చాడు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్థానిక పోలీసులు, మసీదు నిర్వహణ కమిటీ సభ్యులు హాజరైనందున గతంలో నవంబర్ 19న కూడా ఇదే తరహాలో ASI సర్వే నిర్వహించడం గమనార్హం.