
RTC JAC strike notice | హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. మే 6వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. తమ డిమాండ్లను మే 6లోపు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు.. ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసును టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు, లేబర్ కమిషనర్‌కు అందజేసింది.
తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మే 7 నుండి ఆర్టీసీ సిబ్బంది (RTC JAC ) విధులను బహిష్కరిస్తామని జేఏసీ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదనంగా, నేటికీ తమ జీతాలు జమ కాలేదని వారు ఫిర్యాదు చేశారు.
ఆర్టీసీకి బీఆర్ఎస్ రూ.8 కోట్లు..
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో సభ ఏర్పాటు చేసింది. సభకు భారీగా జనాలను తరలించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించేందుకు ఆర్టీసీ నుంచి 3 వేల బస్సులు అద్దెకు తీసుకుంటోంది. ఇందుకోసం టీజీఎస్ ఆర్టీసీ సంస్థకు బీఆర్ఎస్ పార్టీ రూ.8 కోట్లు అందించింది. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగబాలు, కురువ విజయ్ కుమార్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిశారు. బస్సుల అద్దెకు అయ్యే మొత్తం రూ. 8 కోట్ల చెక్కును బీఆర్ఎస్ నేతలు సజ్జనార్‌కు అందజేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.