Warangal RSS Path Sanchalan : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా విజయ దశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ మహానగర్ కాశిబుగ్గ నగర్ లో స్వయం సేవకులు ఆదివారం పథ సంచాలన్ నిర్వహించారు. ఓసిటీ మైదనాం నుంచి ప్రారంభమైన కార్యక్రమం సొసైటీ కాలనీ, కాశిబుగ్గ శివాలయం, తిలక్ రోడ్, ఎల్‌బీనగర్ మీదుగా మరలా కాశిబుగ్గలోని వివేకానంద జూనియర్ కళాశాల వరకు సాగింది. ఈ సందర్భంగా సంఘ కాషాయ ధ్వజాన్ని, భరతమాత చిత్రపటం, సంఘ వ్యవస్థాపకులు, ఆద్య సర్ సంఘచాలక్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్, ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీల చిత్రపటాలను పూలమాలలతో అలంకరించిన వాహనంతో గణ వేషదారులైన సంఘ స్వయం సేవకుల కవాతు (శోభాయాత్ర) నిర్వహించారు. ఈసందర్భంగా స్వయం సేవకులు ఆలపించిన దేశభక్తి గీతాలు కాలనీ వీధులు మార్మోగిపోయాయి. సంఘ అభిమానులు, మహిళలు, పిల్లలు పుష్పాలు జల్లుతూ, స్వయం సేవకుల కవాతుకు ఆహ్వానం పలికారు. వరంగల్ విభాగ్ సహకార్యవాహ్ డా. మామిడాల ఇస్తారి అధ్యక్షత వహించగా నగర సంఘాచాలక్ చామర్తి ప్రభాకర్ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. కార్యక్రమంలో నగర కార్యవహా థౌటం తిరుమల్, గుమ్మళ్ళ కిరణ్, నూతి శ్రీనాథ్, రాహుల్, హరీష్, సుమన్, వడిచర్ల లక్ష్మణ్ తోపాటు ఈ పథ సంచాలన్‌లో సుమారు 200లకు పైగా స్వయంసేవకులు, స్థానికులు పాల్గొన్నారు.
కాశిబుగ్గలో ఉప్పొంగిన దేశభక్తి భావం.. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు పథ సంచాలన్ చేస్తుండగా కొందరు మహిళలు పుష్పాలతో స్వాగతం పలికారు.. #RSS100Years pic.twitter.com/kfwKJgaT8t
— Vande Bhaarath🚩 (@harithamithra1) October 5, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.