
- ఇవి రెండూ ఒకే సైద్ధాంటిక కుటుంబానికి చెందివి : రామ్ మాధవ్
- RSS రాజకీయాలకు అతీతం – BJP రాజకీయ దృక్కోణం నుంచి పనిచేస్తుంది: రామ్ మాధవ్
- ప్రధాని మోదీ ప్రసంగానికి RSS ప్రశంసలు
RSS : భారతీయ జనతా పార్టీ (BJP ) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఒకే సైద్ధాంతిక కుటుంబంలో భాగమని, రెండింటి మధ్య ఎటువంటి భేదాభిప్రయాలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ (Ram Madhav) స్పష్టంగా పేర్కొన్నారు. రెండు సంస్థలు రాజకీయాలు, సామాజిక సేవా రంగాలలో పనిచేస్తాయని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల చరిత్రను గుర్తించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు ప్రశంసించారు.
రెండు సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం ఉందని ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించినపుడు RSS నాయకుడు రామ్ మాధవ్ అలాంటి ఊహాగానాలను తోసిపుచ్చారు. రెండు సంస్థలు సిద్ధాంతపరంగా ఐక్యంగా ఉన్నాయని. ఇవి రెండూ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయని అన్నారు. BJP రాజకీయాల్లో పనిచేస్తుండగా, RSS దాని వెలుపల దేశ సామాజిక సేవ కోసం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. BJP మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాధవ్ ఇక్కడ ANI కి మాట్లాడుతూ, ఈ ఊహాగానాలు, ఆరోపణలు తరచూ వస్తూనే ఉంటాయని అన్నారు. వారికి ఎటువంటి సమస్య కనిపించకపోతే RSS ను ముందుకు తెస్తారు. RSS, BJP మధ్య చీలిక అసత్య కథనాలు పెట్టిస్తారు. RSS మరియు BJP అనేవి ఒక సైద్ధాంతిక కుటుంబం ద్వారా అనుసంధానించబడిన రెండు సంస్థలు. ప్రధాన మంత్రి మోదీ తన ప్రసంగంలో 100 సంవత్సరాల పురాతన సంఘ్ గురించి ప్రస్తావించినందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న తరుణంలో RSS నాయకుడు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు
బిజెపి రాజకీయ దృక్పథంతో పనిచేస్తుంది: రామ్ మాధవ్
బిజెపి రాజకీయ దృక్కోణం నుంచి పనిచేస్తుందని, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని, దేశాభివృద్ధికి అనేక రకాల సేవలు చేస్తుందని రామ్ మాధవ్ అన్నారు. మేము ఒకే సిద్ధాంతం కలిగిన కుటుంబం నుండి వచ్చాం కాబట్టి మేము సన్నిహితంగా ఉంటాం. దీని కారణంగా మా మధ్య ఎప్పుడూ ఎటువంటి ఉద్రిక్తత లేదు. కాంగ్రెస్‌తో సహా అన్ని రకాల విభిన్న రాజకీయ నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులకు తమ సంస్థలోకి స్వాగతిస్తుంటామని మాధవ్ పునరుద్ఘాటించారు. అయితే, రాజకీయ లాభం కోసమే ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ కారణాల వల్ల కొంతమంది వ్యక్తులు ఎల్లప్పుడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్నారని, ఉదాహరణకు కొంతమంది కాంగ్రెస్ నాయకులను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. కానీ అందరికీ ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయాలకు దూరంగా ఉంటూనే భారతదేశ సంస్కృతి పరిరక్షణకు పనిచేస్తుందని తెలుసు. ఈ సంస్థ మంచి వ్యక్తులను తయారు చేయడం, మానవ నిర్మాణాన్ని చేపట్టడం వంటి పనులు చేస్తోందని అందరికీ తెలుసునని అన్నారు. మా సంస్థలో అట్టడుగు వర్గాలు , విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారందరికీ పని చేయడానికి అవకాశం లభిస్తుంది. అన్ని రాజకీయ నేపథ్యాల నుండి వచ్చిన వారికి అవకాశం లభిస్తుందని నేను చెప్పినప్పుడు, దాని అర్థం కాంగ్రెస్ కూడా అందులో ఉందని, కానీ కొంతమంది ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకిస్తే రాజకీయ ప్రయోజనాలు లభిస్తాయని భావిస్తున్నారని ఆయన అన్నారు. మంచి వ్యక్తుల సృష్టికి, సంస్థలో మానవాభివృద్ధికి సంఘ్ ఎలా పనిచేస్తుందో ఆయన వివరించారు.
ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రశంసలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని కూడా ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ప్రశంసించారు, ఈ ప్రసంగం మొత్తం దేశానికి, మఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు చాలా మంచి సందేశాన్ని పంపిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి దీనిని ప్రస్తావించారని, దేశం కోసం ఆర్ఎస్ఎస్ చేసిన కృషిని ప్రశంసించారని, ఇది స్వచ్ఛంద సేవకులందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఈ విషయాలను ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులు విని, అభినందించారు. కానీ దేశంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, వారు ఈ సంస్థలో భాగం కాకపోవచ్చు. బయటి నుండి చూసి దాని పనిని అర్థం చేసుకుంటారు, వారు కూడా దీనిని అభినందిస్తారు అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.