RG Kar case | ఆర్‌జి కర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు, సంజయ్ రాయ్ సోమవారం షాకింగ్ కామెంట్స్ చేసాడు, కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ మొత్తం కేసును కుట్ర పన్నారని, అక్రమంగా తనను ఇరికించారని ఆరోపించారు. సీల్దా కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో పోలీసు వ్యాను లో నుంచి ఆయన ఈ సంచలన ఆరోపణలు చేశారు. “వినీత్ గోయల్ (మాజీ కోల్‌కతా పోలీస్ కమీషనర్) మొత్తం కుట్ర (ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ రెసిడెంట్ డాక్టర్‌పై అత్యాచారం హత్య) చేసి నన్ను ఇరికించాడని చెప్పాడు.
ఈ కేసులో ఈరోజు విచారణ ప్రారంభం కావడంతో సంజయ్ రాయ్‌ను సీల్డే కోర్టుకు తరలించారు. అదనపు జిల్లా ,సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ కోర్టులో విచారణలు జరిగాయి. ఈసందర్భంగా రాయ్‌ను మధ్యాహ్నం కోర్టుకు తీసుకువచ్చారు.
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (రేప్), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు శిక్ష), 103 (హత్యకు శిక్ష) కింద రాయ్‌పై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా, RG కర్ హాస్పిటల్‌లోని సెమినార్ రూమ్‌లో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మృతదేహం కనుగొన్న ఒక రోజు తర్వాత, ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు సంజయ్ రాయ్‌ని అరెస్టు చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది.