రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..

రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..

సుపారీ గ్యాంగ్ అరెస్టు

హన్మకొండ: మూడు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగ్ ను బచ్చన్నపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు ఒక కారు, మూడు సెల్ ఫోన్లు, రూ.15వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో గిరబోయిన అంజయ్య(55), గోపాల్ నగర్, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా, డోలకొండ శ్రీకాంత్(22), బచ్చన్నపేట, జనగామ జిల్లా,  శివరాత్రి బాషా, అలియాస్ భాస్కర్(27). బచ్చన్నపేట ఉన్నారు. కాగా మరో ఇద్దరు నిందితులు బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల తిరుపతి, దండుగుల రాజు పరారీలో ఉన్నారు.

READ MORE  కేదార్ నాథ్ లో గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించిన వ్యక్తి అరెస్ట్

భూ వివాదం నేపథ్యంలో..

కాగా అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ కు చెందిన గురబోయిన అంజయ్య భూములకు సంబంధించి కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సర్వే నం 174 భూములకు సంబంధించి రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రామకృష్ణయ్యపై పగ పెంచుకొని అతడిని హత్య చేసేందుకు అంజయ్య సిద్ధపడ్డాడు. ఇందుకోసం అంజయ్య గతంతో పరిచయం ఉన్న బచ్చన్నపేటకు చెందిన తిరుపతితో ఒప్పందం చేసుకున్నాడు. రామకృష్ణయ్య అంతమొందిస్తే రూ.8 లక్షలు ఇస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించిన తిరుపతి.. అంజయ్య నుంచి రూ. 50వేలు అడ్వాస్సు తీసుకున్నాడు. రామకృష్ణయ్యను హత్య చేసేందుకు తిరుపతి మరో ముగ్గురు నిందితులు తన దగ్గరి బంధువులైన బచ్చన్నపేటకు చెందదిన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, ఆలియాస్ భాస్కర్, దండుగుల రాజు సాయం తీసుకున్నాడు. ఈనెల 15న ఒక కారును తీసుకొని సాయంత్రం 5.30 గంటలకు పోచన్నపేట గ్రామ శివారు ప్రాంతంలో కాపు కాశారు. ఈక్రమంలో బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్న రామకృష్ణయ్యను నిందితులు నలుగురు బలవంతంగా కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు చిన్నరామన్చర్ల గ్రామ శివారులో రామకృష్ణయ్య కారు నుంచి కిందికి దింపి టవల్ తో మెడను బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితులు రామకృష్ణయ్య మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి ఓబూల్ కేశవాపూర్, పెద్దపహాడ్ మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ నీటిగుంటలో రామకృష్ణయ్య మృతదేహాన్ని పడవేశారు. నిందితులు అక్కడి నుంచి బచ్చన్నపేటకు చేరుకొని రామకృష్ణయ్య హత్య చేసినట్లుగా ప్రధాన నిందితుడు అంజయ్యకు సమాచారం అందించి కారును అంజయ్య ఇంటి ముందు ఉంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా నిందితుడు అంజయ్య గతంలో అక్టోబరులో సుపారీ గ్యాంగ్ కు రెండున్నర లక్షలు సుపారి ఇచ్చి సుభద్ర అనే మహిళను హత్య చేయించాడు.

READ MORE  Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర‌ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద‌ ఎన్ కౌంట‌ర్‌.. 29 మంది నక్సల్స్‌ మృతి

ముమ్మరంగా దర్యాప్తు..

పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఇందులో ప్రధాన నిందితుడు అంజయ్యను పోలీసులు అరెస్టు చేయగా.. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మిగతా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. ఈ హత్య కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, నర్మెట్ట సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగబాబు, బచ్చన్నపేట ఎస్ఐ నవీన్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రాంబాబు, ఎస్ఐ దేవేందర్, శరత్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ రంగనాథ్ అభినందించారు.

READ MORE  భార్యను రివాల్వర్ తో కాల్చిన భర్త.. అదే బుల్లెట్ తో అతడు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *