Ravindra Jadeja | బిజెపిలో చేరిన భారత స్టార్ క్రికెటర్
Ravindra Jadeja | భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే, రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ధృవీకరించారు. రివాబా తన ఫోటోలను Xలో పోస్ట్ చేసింది. తన పోస్ట్‌లో, రివాబా బిజెపి సభ్యత్వ కార్డులతో తాను, తన భర్త చిత్రాలను కూడా షేర్ చేశారు.
మీడియాతో రివాబా మాట్లాడుతూ.. ‘నేను ఇంటి నుంచే సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించాను. మెంబర్‌షిప్ క్యాంపెయిన్‌ను ఇటీవల ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రారంభించారని, ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సెప్టెంబర్ 2 న మొదటి సభ్యుడిగా మారారని తెలిపారు.
రివాబా రాజకీయ ప్రస్థానం..
2019లో రివాబా భాజపాలో చేరారు. పార్టీ అధిష్ఠానం ఆమెను 2022లో జామ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపింది. ఆప్ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్‌పై రివాబా విజయం సాధించారు. అదే సమయంలో, తన ఎన్నికల ప్రచారంలో, రవీంద్ర జడేజా కూడా అతనితో ప్రచారంలో కనిపించారు.
క్రికెట్ లో జడేజా రికార్డ్స్..
Ravindra Jadeja Records : 35 ఏళ్ల రవీంద్ర జడేజా జూన్‌లో దక్షిణాఫ్రికాపై భారతదేశం చారిత్రాత్మక T20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత T20Iల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా తరఫున జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. అతని అంతర్జాతీయ రికార్డు అద్భుతంగా ఉంది. జడేజా భారత్ తరఫున 74 టీ20 మ్యాచ్‌లు ఆడి 515 పరుగులు చేశారు. ఈ ఫార్మాట్‌లో 54 వికెట్లు కూడా తీశాడు. ఒక మ్యాచ్‌లో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి జడేజా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. జడేజా ఇప్పటికీ భారత్ తరఫున వన్డే, టెస్టులు ఆడనున్నాడు. కాగా జడేజాతోపాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..