Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు
Ration Card New Benifits | ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి రెగ్యులర్ గా ఇచ్చే బియ్యం నిత్యవసర సరుకులతో పాటుగా అదనంగా రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో అక్కడక్కడ రాగు సాగు బాగా ఉంటుంది. కాకినాడ ఏరీయాలో ఏటా రాగుల సాగు బాగుంటుంది. ఐతే ఇప్పటికే కాకినాడ జిల్లాలో 70 టన్నుల రాఘు సేకరించారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏపీలో రేషన్ కార్డు దారులందరికీ రేషన్ లో రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రస్తుతం కాకినడ, పిఠాపురం కొన్ని ఏరియాల డీలర్లకు రాగులు సరఫరా చేస్తున్నారుఇ. త్వరలోనే రాష్ట్రమంతా కూడా రాగులు అంద చేస్తున్నారు. ఇక మీదట రేషన్ కి వెళ్లినప్పుడు అన్నిటితో పాటుగా రాగులు కూడా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి.
రాగులు ఎలా ఇస్తున్నారు..?
Ration Card New Benifits : రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి రాగులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే కుటుంబం లో ఎంతమంది సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి 3 కిలోల చొప్పున రాగులు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే కుటుంబంలో ఒక రేషన్ కార్డులో ఇద్దరు సభ్యులు ఉంటే వారికి 4 కిలో చొప్పున 8 కిలో బియ్యం దానితో పాటే 3 కిలోల చొప్పున 6 కిలోల రాగులు అందివ్వనున్నారు. రాగుల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్ల ఈ రాగుల పంపిణి విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకూడదని తెలుస్తుంది.
రాగులే కాదు త్వరలో మరో చిరు దాన్యం కూడా రేషన్ తో ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఐతే ఏపీలో రాగులు ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి అక్కడ రేషన్ తో అది ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణాలో మాత్రం రేషన్ తో రాగులు ఇవ్వడం సాధ్యపడదని చెప్పొచ్చు. డేశంలో ప్రతి పథకానికి అప్లై చేయాలన్నా సరే రేషన్ కార్డ్ తప్పనిసరి అయ్యింది. రేషన్ కార్డ్ ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అందుకుంటారు. పీఎం విశ్వకర్మ యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం ముద్ర లోన్ ఇలాంటివి రేషన్ కార్డ్ ద్వారానే పొందాల్సి ఉంటుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..