Saturday, August 30Thank you for visiting

Ration Card e- KYC : రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేశారా..? ఇంకా కొద్ది రోజులే త్వరపడండి..

Spread the love

Ration Card e- KYC in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. జనవరి 31వ తేదీతో సమయం ముగియనుండడంతో ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకుంటే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోసారి గడువు పెంచే చాన్స్ కూడా లేదని సమాచారం. .

రేషన్ షాపుల్లో గత రెండు నెలలుగా ఈ-కేవైసీ అప్డేట్ చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ కోసం ఆధార్‌ నంబర్  ధ్రువీకరణ, వేలిముద్రలను సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు.  ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కట్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా రేషన్ లబ్ధిదారులు జనవరి 31  లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తోంది. అయితే బోగస్ రేషన్ కార్డులను తొలగింపునకు రేషన్ కార్డుతో ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వాళ్ల పేర్లు అలాగే ఉండిపోయాయి. దీంతో రేషన్ సరుకులు చాలావరకు పక్కదారి పడుతున్నాయి.  ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు ఈకేవైసీ ప్రక్రియను అమలుచేస్తున్నారు.  కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి మంజారు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే విధానపరమై న నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈకేవైసీ పూర్తయిన తర్వాత.. లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారో స్పష్టమవుతుంది. ఈ డేటాను కూడా పరిగణనలోకి తీసుకోనుంది కేవైసీ ప్రక్రియ పూర్తికాగానే కొత్త రేషన్ కార్డుల మంజారు ప్రక్రియను వేగవంతం చేస్తుందని సమాచారం.  

ఈకేవైసీ అప్డేట్ ఎలా చేయాలి?

Ration Card E KYC Process : రేషన్‌ కార్డు అధార్ తో ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడానికి రేషన్‌ కార్డులోని కుటుంబ యజమానితోపాటు కుటుంబ సభ్యులందరూ రేషన్ దుకాణం వద్దకు వెళ్లి ఈ పాస్ మిషన్‌లో వేలిముద్రలు వేయాలి.

వేర్వురుగా రేషన్ కార్డు షాప్ కు వెళ్తే కుదరదు.  వేలిముద్రలు వేసిన అనంతరం లబ్దిదారుల ఆధార్ కార్డు నంబర్‌, రేషన్ కార్డు నంబర్ ఈ పాస్ లో డిస్‌ప్లే అవుతుంది.

ఈ-పాస్ మిషన్ లో గ్రీన్ లైట్ వచ్చి ఈకేవైసీ అప్డేటెటెడ్ అని వస్తుంది.

ఒక వేళ రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే లబ్దిదారుడి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు సరిపోలడం లేదని  అర్థం . దీంతో ఆ రేషన్‌ కార్డును తొలగించేస్తారు.

రేషన్ కార్డులో పేర్లు ఉన్న వారంతా ఒకేసా రి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *