Rare Judgement | రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌.. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు

Rare Judgement | రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌.. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు

రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌
రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు

సూర్యాపేట: మదమెక్కిన కామాంధుడికి న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి ఏకంగా 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2012లో చోటుచేసుకున్న ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు (Rare Judgement) ఇచ్చింది. ఈ తీర్పుపై మహిళా, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
వివరాలలోకి వెళితే.. సూర్యాపేట జిల్లాకు చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉపాధి కోసం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణ పరిధిలోని ఆర్జాలబావి ప్రాంతంలో నివాసముంటూ కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సెంట్రింగ్‌ పనిచేసే చిట్యాలకు చెందిన నిజాముద్దీన్‌ అలియాస్‌ నిజ్జు వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉన్నాడు. మైనర్ బాలికకు చాక్లెట్లు కొనిస్తూ, మొబైల్ ఫోన్‌ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు అద్దె ఇంటిని ఖాళీ చేసి, మరోచోట కిరాయి తీసుకున్నారు. ఐనప్పటికీ నిజాముద్దీన్‌ తన వక్రబుద్ధి మార్చుకోకుండా తల్లిదండ్రులు లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పవద్దని బాలికను బెదిరించాడు.

READ MORE  వడ్డీ డబ్బుల కోసం దారుణం.. మహిళను వివస్త్రను చేసి..దాడికి పాల్పడి మూత్రం తాగించారు..

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

కాగా కొన్నాళ్లకు బాలిక కడుపునొప్పి భరించలేక తల్లిదండ్రులకు చెప్పడంతో ఆస్పత్రిలో చూపించారు. వైద్యులు పరీక్షలు చేయగా బాలిక గర్భవతి అని తేలింది. దీంతో 2012 డిసెంబరులో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై నల్లగొండ రూరల్ ఎస్సై కంచర్ల భాస్కర్ రెడ్డి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. అప్పటి సీఐ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. పూర్తిస్థాయి దర్యాప్తుతో అన్ని సాంకేతిక ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్ ను దాఖలు చేశారు. తాజాగా ఈ కేసును విచారించి నల్లగొండ జిల్లా మొదటి అదనపు సెషన్ కోర్టు జడ్జి తిరుపతి… నిందితుడిపై నేరారోపణ రుజువు అయినట్టు ప్రకటించి 60 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. (Rare Judgement). అలాగే బాధితురాలికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం, నిందితుడు సైతం రూ.60 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.. కాగా ఈ తీర్పు పట్ల మహిళా, ప్రజాసంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.

READ MORE  ఢిల్లీలో దారుణం.. వెల్లుల్లి వ్యాపారినికి కొట్టి బట్టలు విప్పి ఊరేగించిన కమీషన్ ఏజెంట్

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *