Rajya Sabha Elections 2024 : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు..
Rajya Sabha Elections 2024 Updates: రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇందులో పార్టీ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ఉన్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు
Rajya Sabha Elections 2024 : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది పార్టీ అధిష్టానం ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, హైదరాబాద్ కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది . ఈ మేరకు పార్టీ హై కమాండ్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లను ప్రకటించింది. కాగా రేపటితో నామినేషన్లకు గడువు ముగియనుండడంతో వీరంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
T Congress Rajya Sabha Candidates : అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ తరఫున 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఏకంగా రాజ్యసభ టికెట్ కేటాయించింది. ఆయన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ 2004, 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ జాబితాను విడుదల చేసింది ఏఐసీసీ.. కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ ను మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ను ఖరారు చేసింది.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ తరపున ఎవరికి అవకాశం దక్కుతుందోనని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్రకు మరోసారి చాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు రాజ్యసభ ఎంపీగా కేవలం రెండేళ్లు మాత్రమే అవకాశం దక్కగా మరోసారి టికెట్ ఇస్తారని పలువురు బావిస్తున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..