రాజ్ నీతి ఒపీనియన్‌ పోల్‌.. సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

రాజ్ నీతి ఒపీనియన్‌ పోల్‌.. సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

తెలంగాణలో బీఆర్ఎస్‌(BRS) హాట్రిక్‌ పక్కా..

హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్ఎస్‌ జైత్రయాత్ర ఈసారి కూడా కొనసాగుతుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్‌ పక్కా అని వెల్లడిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ (CM KCR) నాయకత్వానికే జనం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని పేర్కొంటున్నాయి. సీఎం కేసీఆరే పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని ఇప్పటికే ఇండియా టీవీ, మిషన్‌ చాణక్య, ఎన్పీఐ, ఈఎన్‌ టీవీ తదితర సర్వేలు తేల్చి చెప్పాయి. తాజాగా, రాజ్ నీతి సర్వేలో (Rajneethi Opinion Poll) బీఆర్ఎస్‌ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడయింది.
బీఆర్ఎస్‌ పార్టీకి 77 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఉచితాలు ఇస్తామంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్‌ కేవలం 29 స్థానాలకే పరిమితం కానుంది. ఇక బీజేపీ ఆరు సీట్లతో మరోసారి సింగిల్‌ డిజిట్ వరకే పరిమితమవనుంది. ఇక బీఎస్పీ అసలు ఖాతాయే తెరిచే అవకాశం లేదని తేలింది. అక్టోబరు 28 వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన రాజ్ నీతి.. సర్వే ఫలితాలను సోమవారం విడుదల చేసింది. హైదరాబాద్ లోని ఏడు స్థానాలు మినహా రాష్ట్రంలోని 112 నియోజకవర్గాల్లో ఈ సర్వేని నిర్వహించింది.

READ MORE  Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్..

Rajneeti Opinion Poll 2023
ఇక ఓట్ల శాతం పరంగా చూస్తే బీఆర్ఎస్ (BRS) కు 43.35 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో గులాబీ పార్టీకి 50 శాతం ఓట్లు రానుండగా, పట్టణ ప్రాంతాల్లో 42 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక వయస్సుల వారీగా చూస్తే.. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఓటర్లలో 38 శాతం మంది బీఆర్ఎస్ కు మద్దతు తెలపగా.. 31 నుంచి 40 సంత్సరాల లోపు వారు 40 శాతం, 41-50 ఏళ్ల వయస్కులు 48 శాతం, 51-60 ఏండ్ల వయస్కులు 50 శాతం, 61 ఏండ్లు పైబడినవారు 51 శాతం మంది తాము కేసీఆర్ కే జై కొడతామని స్పష్టం చేశారు.

READ MORE  New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *