TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!

TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!

TG Rain Alert | తెలంగాణలో వ‌చ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న‌దని, ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఇది ఒడిశా వ‌ద్ద‌ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా మీదుగా వెళ్తూ అదే తీవ్రతతో సోమవారం అర్ధరాత్రి వరకు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లే చాన్స్‌ ఉందని అంచనా వేసింది.

READ MORE  Raitu RunaMafi | తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..

ఈ క్రమంలో మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. అలాగే బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు చాన్స్ ఉంద‌ని వివరించింది. ఇదిలా ఉండ‌గా సోమవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ప‌లుచోట్ల భారీ వ‌ర్షాలు కురిశాయి. అలాగే ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మ, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.

READ MORE  New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *