Railway Super App | రైలు ప్రయాణికులకు శుభవార్త, ఆన్ లైన్ లో రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ప్రయాణికులు సాధారణంగా ఐఆర్‌సీటీసీని ఉపయోగిస్తుంటారు. రైల్వే ప్రయాణికులకు కోసం పలు రకాల ప్రైవేట్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, రైల్వే శాఖ అన్నిరకాల సేవలు అందించేందుకు తాజాగా సరికొత్త సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో అన్ని రైల్వేసేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రయాణికుల కోసం కొత్తగా సూపర్ యాప్‌ని రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. రైల్వేలకు సంబంధించిన అన్నిసేవలు ఈ యాప్‌లో ఉంటాయని చెప్పారు. రైలు టికెట్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్నారు. అలాగే, రైలు స్టేటస్‌ని ట్రాక్ చేసేందుకు, పీఎన్‌ఆర్ స్టేటస్‌ని చూసేందుకు వివిధ రకాల యాప్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే, రైల్వేశాఖకు సంబంధించి టికెట్స్ బుకింగ్, పీఎన్‌ఆర్ స్టేటస్, ట్రాకింగ్ స్టేటస్ కోసం విడివిడిగా రకరకాల యాప్స్‌ని ఉపయోగించడం కాస్త ఇబ్బందిగా మారింది.ఈ సమస్యలకు చెక్ పెడుతూ.. మోదీ ప్రభుత్వం కొత్తగా సూపర్ యాప్‌ని తీసుకురానుంది. ఇకపై ఇదే యాప్ (Railway Super App) లోనే టికెట్స్ బుకింగ్, పీఎన్‌ఆర్ స్టేటస్ తోపాటు ట్రెయిన్ ట్రాకింగ్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ యాప్ సాయంతో ప్లాట్‌ఫారమ్ టికెట్ నుంచి జనరల్ టికెట్ వరకు అన్నీ ఆన్‌లైన్ విధానంలో కొనుగోలు చేయవచ్చు.
కాగా రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రైల్వేశాఖ మంత్రి వైష్ణవ్ తెలిపారు. గత దశాబ్దల కాలంగా రైల్వేలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని, అలాగే, సాంకేతికంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైల్వే భద్రతపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దీంతో రైలు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రభుత్వం స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 10వేలు కవచ్ సిస్టమ్‌లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..