Rail News | రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
Rail News | రైలు ప్రయాణికులకు సంతోషం కలిగించేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం తగ్గిపోయిన కారణంగా రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్న కారణంతో పలు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ సౌకర్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, ఏపీలో కొన్ని రైల్వే స్టేషన్లను పూర్తిగా మూసేశారు కూడా.
మరోవైపు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గతంలో ఇచ్చిన హాల్టింగ్ గడువు ముగియడంతో రాకపోకలు ఆగిపోతాయని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 69 రైళ్లకు ఆయా స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈనెల 29వ తేదీతో మొత్తం 69 రైళ్లకు గతంలో జారీ చేసిన గడువు ముగుస్తోంది.
ప్రయాణికుల డిమాండ్ తో పలు రైల్వేస్టేషన్లలో రైళ్లను నిలిపేందుకు అనుమతిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు కొత్తగా మరో 30 స్టేషన్లలో ఇకపై ఆగుతాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 60 రైళ్లకు కొత్తగా హాల్టింగ్ ఇవ్వగా, ఇందులో విజయవాడ మీదుగా వెళ్లే ట్రెయిన్లు 40 కి పైగా ఉన్నాయి. ఈ సదుపాయం ప్రయోగాత్మకంగానే అమలు చేస్తున్నామని, ప్రయాణికుల డిమాండ్, ప్రయాణించే వారి సంఖ్య, ఆదాయాన్ని బట్టి తర్వాత కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
హాల్టింగ్ సౌకర్యం కల్పించిన స్టేషన్లు ఇవే..
- Rail News : బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12708), సికింద్రాబాద్-రాయ్ పుర్(12771) ,
- ఖమ్మంలో ఎర్నాకుళం- పట్నా(22669),
- మధిరలో తిరుపతి-సికింద్రాబాద్ (12763) ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-మహబూబ్ నగర్(12861) ఎక్స్‌ప్రెస్ ఆగుతాయి.
- మంచిర్యాలలో హజ్రత్ నిజాముద్దీన్- తిరుపతి(12763), ఎర్నాకుళం-పట్నా(22669) ఆగుతుంది.
- రామగుండం రైల్వే స్టేషన్లో బెంగళూరు-దానాపూర్(12295), హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్(12721), మైసూర్-దర్బంగ(12578), బెనారస్-మనా డపం(22535), ఎర్నాకుళం-పట్నా(22669) రైళ్లు ఆగుతాయి.
- మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో చెన్నై సెంట్రల్-హైదరా బాద్(12603), భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015), నాగర్సోల్-నర్సాపుర్(17232) రైళ్లు నిలుస్తాయి.
- షాద్‌నగర్‌లో యలహంక-కాచిగూడ (17604), వరంగల్ లో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-హజ్రత్ నిజాముద్దీన్(12611), హజ్రత్ నిజాముద్దీన్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12612) ఆగుతాయి.
- పెద్దపల్లి జంక్షన్ లో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ (12655), సికింద్రాబాద్-రాయపుర్(12771), అహ్మదాబాద్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12656), సికింద్రాబాద్-రాయ పూర్(12771), రాయపుర్-సికింద్రాబాద్(12772), సికింద్రాబాద్-హిస్సార్ (22737), హిస్సార్-సికింద్రా (22738), హైదరాబాద్-రాక్బల్(17005), రాక్సల్-హైదరాబాద్(17006) రైళ్లను ఆపుతారు.
పూరి-తిరుపతి (రైలు నెంబరు 17479), తిరుపతి-కాకినాడ టౌన్ (రైలు నెంబరు 17249), బిలాస్పూర్- తిరుపతి (రైలు నెంబరు 17481)కు హాల్టింగ్ ఉంటుంది. - చినగంజాం స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. గుంటూరు-రాయగడ (రైలు నెంబరు 17243)కు భీమడోలు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. గుంటూరు-నరసాపూర్ (రైలు నెంబరు 17281)కు
పుట్లచెరువు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. కాత్రా-కన్యాకుమారి (రైలు నెంబరు 18818)కు - గూడూరు జంక్షన్లో, విజయవాడ-కాకినాడ పోర్టు (రైలు నెంబరు 17257)కు పసివేదల స్టేషన్, విజయవాడ- మచిలీపట్నం (రైలు నెంబరు 07866) కు ఉప్పులూరు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు.
- నడికుడి స్టేషన్లో భువనేశ్వర్-సికింద్రాబాద్ (రైలు నెంబరు 17015)ను
- పిడుగురాళ్ల, సత్తెనపల్లి స్టేషన్లలో భువనేశ్వర్-సికింద్రాబాద్ (రైలు నెంబరు 17015)కు స్థాపింగ్ కల్పించారు. నాగర్సోల్-నర్సాపూర్ (రైలు నెంబరు 17232)కు కూడా సత్తెనపల్లి స్టేషన్ లో పాటు నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్ట్ కల్పిం చారు.
- ధర్మవరం-రేపల్లె (రైలు నెంబరు 17216)కు గిద్దలూరు స్టేషన్లో, లింగంపల్లి- నర్సాపూర్ (రైలు నెంబరు 17256), చెంగల్పట్టు-కాకినాడ (రైలు నెంబరు 17643)కు మంగళగిరి స్టేషన్లో హాల్ట్ కల్పించారు.
- ధర్మవరం-మచిలీపట్నం (రైలు నెంబరు 17216)ను మార్కాపురం రోడ్డు స్టేషన్లో, భువనేశ్వర్-సికింద్రాబాద్ (రైలు నెంబరు 17015)కు మిర్యాలగూడ స్టేషన్లో, నర్సాపూర్-లింగంపల్లి (రైలు నెంబరు 17255) కు హాల్టింగ్ సౌకర్యంకల్ిపంచారు.
- నల్గొండ స్టేషన్లో, చెంగల్పట్టు కాకినాడ (రైలు నెంబరు 17643)ను న్యూ గుంటూరు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు.
యశ్వంత్ పూర్-మచిలీపట్నం (రైలు నెంబరు 17212)కు కంభం స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. మొత్తం 69రైళ్లకు ప్రయోగాత్మకంగా మరికొన్ని రోజుల పాటు ఈ రైల్వేస్టేషన్లలో నిలుపుతారు. రద్దీకి అనుగుణంగా వాటి కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకుంటారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..