Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..
QR code ticketing system : రైల్వే స్టేషన్లు తరచుగా ప్రయాణికులతో కిక్కిరిసి పోతూ ఉంటాయి. టికెట్ కోసం ప్రయాణికులు బారులుతీరి ఉంటారు. క్యూలైన్ లో టికెట్ కోసం నిలుచుండగానే ఒకోసారి ట్రైయిన్ వస్తుంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు పడే హైరానా అంతాఇంతా కాదు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లు వచ్చిన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే (Indian Railways ) కూడా తాజాగా అప్ డేట్ అయింది.
సాధారణ రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ (QR code ticketing system) ద్వారా బుక్ చేసుకొనే అదిరిపోయే ఫీచర్ ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 రైల్వే స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. జనరల్ బుకింగ్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ క్యూాఆర్ కోడ్ టికెట్లను ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
టికెట్ కొనుగోలు చేసేటపుడు జనరల్ బుకింగ్ కౌంటర్ల టికెట్ విండో దగ్గర ప్రయాణికులు బుక్ చేసుకునే టికెట్ వివరాలు, చార్జీలను అందుబాటులో ఉంచుతారు.. అందుకు అనుగుణంగా చార్జీలు చెల్లించి క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ డిస్ప్లే బోర్డులో రైలు బయలుదేరే స్టేషన్, చేరుకొనే స్టేషన్, ప్రయాణపు తరగతి, పెద్దలు, పిల్లల సంఖ్య, చార్జీలు వంటి వివరాలు ఉంటాయి. సికింద్రాబాద్ డివిజన్ లోని సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, బేగంపేట, జేమ్స్ స్ట్రీట్, ఫతేనగర్ బ్రిడ్జ్, కాజీపేట, వరంగల్, మంచిర్యాల, మహబూబాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ స్టేషన్లలోని 31. కౌంటర్ల ద్వారా కొత్తగా నగదు రహిత లావాదేవీల సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
రైలు ప్రయాణికులు జనరల్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్లలో
క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్ల కొనుగోలు సౌకర్యం
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే యూ.టి.ఎస్. (జనరల్ బుకింగ్) కౌంటర్లలో క్యూఆర్ కోడ్ సదుపాయంతో అన్‌రిజర్వ్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభతరం @RailMinIndia pic.twitter.com/q6fJobo0hF— South Central Railway (@SCRailwayIndia) March 21, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..