PV Narasimha Rao | మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన కేసీఆర్

PV Narasimha Rao | మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన కేసీఆర్

PV Narasimha Rao | హైద‌రాబాద్ : భార‌త దివంగత మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ‌ పీవీ న‌ర‌సింహ రావుకు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌డంపై  మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ ట్వీట్ చేశారు. మాజీ ప్ర‌ధాని పీవీకి భార‌త‌రత్న ప్ర‌క‌టించ‌డంపై  ఎక్స్ వేదిక‌గా కేసీఆర్ ప్రధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. పీవీ న‌ర‌సింహా రావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆనందాన్ని  క‌లిగించింది అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

READ MORE  తెలంగాణలో రూ.21,566 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశ ఆర్థికాభివృద్ధిలో పీవీది కీలక పాత్ర : ప్రధాని మోదీ

PM Modi | దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ న‌ర్సింహారావుకు భారతరత్న వరించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ .. సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఒక రాజీతిజ్ఞుడిగా ఈ దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా.. కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రి గా పీవీ అందించిన సేవలు ఎన్నిటికీ మరిచిపోలేనివని అన్నారు.

READ MORE  Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మ‌హిళ‌ల‌కు వ‌రాల జ‌ల్లు..

చిరంజీవి ఏమన్నారంటే..

భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు  పునాది వేసిన వ్యక్తి పీవీ అని చిరంజీవి అన్నారు.  తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధారి  పీవీ న‌ర్సింహారావు (PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భార‌త‌ర‌త్న (Bharat Ratna) వరించడంపై  టాలీవుడ్‌ మెగా స్టార్‌ చిరంజీవి (Chiranjeevi ) సంతోషం  వ్యక్తం చేశారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

READ MORE  మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *