Porsche Accident | పుణే యాక్సిడెంట్ కేసులో బాలుడి తండ్రికి 2-రోజుల పోలీసు కస్టడీ
Pune Porsche Accident news | పూణే: పోర్షే కారును అతివేగంగా నడిపి ఇద్దరు యువ టెక్కీల మరణానికి కారణమైన పూణే యువకుడి తండ్రికి రెండు రోజుల పోలీసు కస్టడీ విధించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పోలీసులను మైనర్ బాలుడి తండ్రిని అరెస్టు చేశారు.
కళ్యాణి నగర్ లో ఆదివారం అర్ధరాత్రి 2.15 గంటల ప్రాంతంలో 12వ తరగతి ఫలితాలను సంబరాలు చేసుకునేందుకు పూణెలోని రెండు పబ్బుల్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన 17 ఏళ్ల బాలుడు తన కారును అతివేగంగా నడపడంతో 24 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే.. కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్ నడుపుతున్న టెకీలు అనీష్ అవధియా ఎగిరిపోయి ఆగి ఉన్న కారును ఢీకొట్టగా, వెనుక కూర్చున్న అశ్విని కోష్ట 20 అడుగుల ఎత్తులో గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై దేశ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
17 సంవత్సరాల 8 నెలల వయస్సులో ఉన్న నిందితుడు డ్రైవింగ్ చేయడానికి చట్టబద్ధమైన వయస్సు కంటే నాలుగు నెలలు తక్కువగా ఉన్నాడు. మహారాష్ట్రలో మద్యపానం చేయడానికి చట్టబద్ధమైన వయస్సు కంటే ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంది.
జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 75 (పిల్లలను నిర్లక్ష్యం చేయడం లేదా పిల్లలను మానసిక లేదా శారీరక వ్యాధులకు గురి చేయడం), 77 (పిల్లలకు మత్తు కల్గించే మద్యం లేదా డ్రగ్స్ సరఫరా చేయడం) కింద తండ్రిపై అభియోగాలు మోపారు.
ప్రముఖ బిల్డర్ అయిన నిందితుడి తండ్రిని బుధవారం పూణె సెషన్స్ కోర్టు ముందు హాజరుపరచగా పోలీసులు అతనిని ఏడు రోజుల పాటు కస్టడీకి కోరినప్పటికీ, శుక్రవారం వరకు అనుమతి లభించింది. అతను ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్నాడని, అతని వద్ద ఆధారాలు ఉన్నాయని అనుమానం ఉందని పోలీసులు తెలిపారు.
పోర్షే కారును మార్చిలో కొనుగోలు చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదని, బాలుడి తండ్రికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని, పబ్‌కు వెళుతున్నాడని తెలిసి కారు ఇచ్చినందుకే అతడిని అరెస్ట్ చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. “బాలునికి ఇచ్చిన కారు నంబర్ ప్లేట్ లేకుండా ఉంది. మాకు కారు పత్రాలు, యువకుడికి ఇచ్చిన డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు కావాలి” అని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
‘తప్పుదోవ పట్టించేందుకు ప్లాన్’
Pune Porsche Accident news : బాలుడిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు కావడంతో అతడి తండ్రి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అతను తన కారులో ఇంటి నుండి బయలుదేరాడు. ఆ వాహనం డ్రైవర్‌ను ముంబైకి వెళ్లమని కోరాడు, మరొక డ్రైవర్‌ను వేరే కారులో గోవాకు బయలుదేరమని అడిగాడు. బిల్డర్ ముంబైకి వెళ్లే మార్గంలో కారు దిగి, ఛత్రపతి శంభాజీనగర్ వైపు వెళ్లేందుకు స్నేహితుడి కారులో ఎక్కాడు. అతనిని గుర్తించకుండా ఉండేందుకు అతను కొత్త సిమ్ కార్డును ఉపయోగించడం ప్రారంభించాడని అధికారులు తెలిపారు.
యాక్సిడెంట్ జరిగినపుడు పోలీసులు నిందితుడి తండ్రికి కాల్ చేయగా అతడు వాస్తవానికి శంభాజీనగర్ లో ఉన్నా కూడా తాను షిర్డీలో ఉన్నానని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు రిమాండ్ కాపీలో పేర్కొన్నారు. అతను తన స్మార్ట్‌ఫోన్‌ను దాచిపెట్టినట్లు అనిపించిందని, అతను కీప్యాడ్ కలిగిన నోకియా ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నాడు. పోర్స్చే కారును కలిగి ఉన్న వ్యక్తి వద్ద కేవలం 800 రూపాయల ఫోన్ మాత్రమే ఉంటుందంటే నమ్మడం కష్టం” అని పోలీసులు కోర్డుకు విన్నవించారు. అతను వాడుతున్న ఫోన్, కారు రెండింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..