Property Tax Every Month | రాష్ట్రంలో ఇకపై ప్రతినెలా ఆస్తిపన్ను ?
ఆదాయాన్ని పెంచుకునేందుకు సర్కారు కసరత్తు
Property Tax Every Month in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి ప్రతినెలా ఆస్తి పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న ఫీజులు, పన్నులను మరింత సులభతరం చేయడంపై తెలంగాణ సర్కార్ దృష్టిసారించింది. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచే మార్గాల అన్వేషణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది.
Property Tax in GHMC: ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న పన్నుల చెల్లింపుల ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం సులభతరం చేయాలని భావిస్తోంది. ప్రజలపై ఒక్కసారిగా ఆర్థిక భారం పడకుండా, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు కూడా ప్రారంభించాయి. విద్యుత్తు ఛార్జీలు, నల్లా బిల్లుల మాదిరిగా ఆస్తి పన్నును కూడా నెలవారీగా వసూలు చేయాలని యోచిస్తున్నారు. హైదరాబాద్ నగరం తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం ఆస్తి పన్ను విధిస్తోంది. పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీ చట్టంలోని ఆ నిబంధనను సవరించి ఇక నుంచి నెలకు ఒకసారి ఆస్తిపన్ను విధించాలనే ఆలోచన అధికార వర్గాలు చేస్తున్నాయి.
మరోవైపు ఇంటింటా రోజువారీగా చెత్త సేకరణ రుసుము కొన్ని కాలనీల్లో రూ.50 ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. అయినా నిత్యం చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. చెత్త సేకరణను మెరుగుపరచడం, రుసుమును నియంత్రించడంపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. జీహెచ్‌ఎంసీకి పలు విభాగాల నుంచి ఆదాయం వస్తోంది. వాటిని నిర్ధారించడంలో లోపాల కారణంగా కార్పొరేషన్ ఏటా రూ.కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. అలాగే నిర్మాణాల కు రూ.1,200 లోపు ఆస్తి పన్ను ఉంటే.. రూ.101 మాత్రమే చెల్లిస్తే చాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్షేత్ర స్థాయిలో చాలాచోట్ల దుర్వినియోగమవుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి పలు లోపాలను పరిచేసి రాష్ట్ర ఖజానాను పెంచుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..