Baby Berth in Trains | భారతీయ రైల్వేలో బేబీ బెర్త్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయబోతోందా? అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారు.?
Baby Berth in Trains | న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు బేబీ బెర్త్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయబోతున్నాయా? రైలు ప్రయాణికులు, ప్రత్యేకించి తమ పసి పిల్లలు, చిన్న పిల్లలతో ప్రయాణించే మహిళల్లో ఆందోళన కలిగించిన ప్రశ్న ఇది.
భారతీయ రైల్వేలు స్లీపర్. హయ్యర్ క్లాస్ కోచ్‌లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. అయితే కొన్ని రైళ్లలో సైడ్ లోయర్ బెర్త్‌ల కోసం అదనపు కుషన్లను ప్రవేశపెట్టారు. ఇవి పసి పిల్లల బెర్త్ సీట్ల కోసం పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ట్రయల్ రన్‌లో శిశువులతో ఉన్న తల్లులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి లక్నో మెయిల్‌లో రెండు బేబీ బెర్త్‌లను కొత్తగా అమర్చారు.
అన్ని రైళ్లలో బేబీ బెర్త్ సీట్లను అమర్చడానికి ప్రభుత్వం చొరవ చూపడంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పైలట్ ప్రాజెక్ట్‌లో ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెట్టినట్లు రాజ్యసభకు నివేదించారు. “తల్లులు తమ పిల్లలతో ప్రయాణించే వారికి ప్రయాణ సౌలభ్యం కోసం, ట్రైన్ నెం. 12229/30 లక్నో మెయిల్‌లోని ఒక కోచ్‌లో రెండు లోయర్ బెర్త్‌లకు అటాచ్‌మెంట్‌గా రెండు బేబీ బెర్త్‌లు ట్రయల్ కింద అమర్చాము అని వైష్ణవ్ రాతపూర్వక సమాధానంలో తెలిపారు. ప్రయాణికులు రైల్వే చొరవను మెచ్చుకుంటూ, బేబీ బెర్త్ అటాచ్‌మెంట్ వల్ల ఏర్పడిన తమ సమస్యలను కూడా వెల్లడించారు.
మొదట్లో ప్రయాణీకులు వీటిని చూసి హర్షం వ్యక్తం చేస్తూ.. సానుకూల అభిప్రయాలను వెల్లడించారు. కానీ సీటు కింద లగేజీ పెట్టుకోవడానికి, అలాగే సీట్ల మధ్య కాళ్లు పెట్టుకోవడానికి తగినంత ఖాళీ స్థలం లేదని, దీనివల్ల చాలా అసౌకర్యంగా ఉందంటూ ప్రయాణీకులు వెల్లడించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో వెల్లడించారు. దీనికి అనుగుణంగా ప్రయాణీకుల కోచ్‌లలో మార్పులు, అప్‌గ్రేడేషన్ చేయడానికి భారతీయ రైల్వేలు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు.
Baby Berth in Trains : మీరు బేబి సీట్ల కోసం ఎదురుచూస్తుంటే, రైల్వేలు దీన్ని అమలు చేసే వరకు కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. బేబీ బెర్త్ లపై ప్రయాణీకుల నుంచి మిశ్రమ స్పందనలను వచ్చింది. కొందరు ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటే, మరికొందరు సీట్లు సురక్షితం కాదని విమర్శించారు. ఈ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టే ముందు రైల్వేలు మహిళల నుంచి ఇన్‌పుట్ కోరాలని ప్రయాణికులు సూచించారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..