ED raids | తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy)కి ఈడీ షాక్ ఇచ్చింది. న్యూఢిల్లీ నుంచి ఈడీ అధికారులు నగరానికి చేరుకుని పొంగులేటి నివాసంలోపాటు కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు న్యూఢిల్లీ నుంచి నగరానికి చేరుకుని రెవెన్యూ మంత్రి, ఇతర వ్యక్తులకు సంబంధించిన 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రికి సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో 16 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆయన కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) , ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ కంపెనీ ఇటీవలే నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ పనుల్లో ఒకదాన్ని దక్కించుకుంది.
జూబ్లీహిల్స్ పరిధిలోని మంత్రుల నివాసాలు, రాఘవ్ కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో 16 బృందాలుగా ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. కాగా గత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే జి వినోద్‌పై కూడా ఇలాంటి దాడులు జరిగాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..