Jharkhand Police | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసులు సస్పెండ్
Police suspended | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
రాంచీ: లంచంగా నడిరోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు (Jharkhand Police) ఏరుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కాగా ఈ వీడియో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన ఆ నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి బైక్‌పై అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్నాడు.. పోలీసులు అతడిని ఆపేందుకు యత్నించగా లంచంగా కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే ఏఎస్‌ఐతో సహా నలుగురు పోలీసులు రోడ్డుపై పడిన ఆ నోట్లు తీసుకున్నారు.
దీనిని కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిని చూసిన పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏఎస్‌ఐతో సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ పీయూష్ పాండే తెలిపారు. పోలీసులు అవినీతికి పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..