
PMGKAY | దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY)తోపాటు ఇతర పథకాలను కేంద్రం మరోసారి పొడిగించింది. 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకాల కోసం రూ. 17,082 కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థ (TPDS), ఇతర సంక్షేమ పథకాలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవ (ICDS) అంతటా బలవర్థకమైన బియ్యం సరఫరా, దేశంలో రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పీఎం పోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పీఎంజీకేఏవైతోపాటు పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. లోథాల్‌లో ‘నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్’ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో రూ.4,406 కోట్లతో 2280 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం.. సాధారణ బియ్యంలో అదనంగా పోషకాలను కలిపి ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేస్తారు. ప్రజల ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సూక్ష్మపోషకాలను అందులో జోడిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి ఆమోదించింది. రాజస్థాన్, పంజాబ్ దేశ సరిహద్దు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.4,406కోట్లతో 2,208 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..