
PM Narendra Modi | బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు ఖగెన్ ముర్ము, శ్రీరూపా మిత్ర చౌదరికి మద్దతుగా మాల్దా పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం యువకుల జీవితాలతో ఆడుకుంది. భారీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో దాదాపు 26,000 మంది జీవనోపాధి కోల్పోయారు. అని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 (ఎస్‌ఎల్‌ఎస్‌టి) రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.. రిక్రూట్ అయిన వారిలో ఒక వర్గం వారు తీసుకున్న జీతాలను 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
మొదట లెఫ్ట్ ఫ్రంట్, ఆ తర్వాత టీఎంసీ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకున్నాయి. టిఎంసి పాలనలో బెంగాల్‌లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి. శారదా చిట్ ఫండ్, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ నుండి రిక్రూట్‌మెంట్, రేషన్ కుంభకోణాల వరకు, TMC ప్రతిచోటా అవినీతిలో మునిగిపోయింది. కట్ అండ్ కమీషన్ (టిఎంసికి) లేకుండా బెంగాల్‌లో ఏదీ పనిచేయదు, ”అని మోడీ అన్నారు.
అదే సమయంలో, వారసత్వపు పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలు, సంపద పునర్విభజనపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ప్రకటనపై కూడా కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు . కాంగ్రెస్ వారసత్వపు పన్ను విధిస్తుందని, జీవితంలో, మరణానంతరం ప్రజలను దోపిడీ చేస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన సంపదను తమ పిల్లలకు పంచకుండా ఎక్కువ పన్నులు వేసి ఖజానా నింపుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు.
“TMC పాలనలో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయి. TMC చేసిన మోసానికి రాష్ట్రం మొత్తం మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది” అని మోదీ అన్నారు. CAA గురించి దుష్ప్రచారం చేస్తున్నందుకు కాంగ్రెస్, TMC లపై మోదీ విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీల మధ్య బుజ్జగింపుల పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ మీ ఆస్తులను లాక్కోవాలనుకుంటోంది. దీనికి వ్యతిరేకంగా టిఎంసి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను బెంగాల్‌లో సెటిల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మీ సంపదను వారికి పంచడం గురించి మాట్లాడుతున్నారు, ”అని మోదీ అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం
ఈవీఎం-వీవీప్యాట్ (EVM-VVPAT)పై సుప్రీంకోర్టు (Supreme Court) బలమైన తీర్పు ఇచ్చిందని, పాత విధానంలో పేపర్ బ్యాలెట్ రూపంలో ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను తోసిపుచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యానికి ఎంతో శుభదినమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ గౌరవించలేదని విమర్శించారు. బీహార్ (Bihar)లోని అరారియాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోటాలోకి బీహార్ ముస్లింలను తీసుకురావాలని భావిస్తోందని ప్రధాని ఆరోపించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..