
- ఒడిశా తీరంలో లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ తొలి పరీక్ష విజయవంతం
డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. - రూ. 79,000 కోట్ల సైనిక కొనుగోళ్లకు ఆమోదం
- గేమ్ ఛేంజర్‌గా నిలవనున్న పినాకా LRGR-120
- ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలోపేతానికి మోదీ సర్కార్ భారీ నిధులు
బాలాసోర్/న్యూఢిల్లీ : భారతదేశ రక్షణ సామర్థ్యం మరో శిఖరాన్ని తాకింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ (LRGR-120) తొలి విమాన పరీక్ష సోమవారం ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)లో విజయవంతంగా నిర్వహించబడింది. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించి, భారత ఫిరంగి దళం (Artillery) శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది.
ఖచ్చితత్వానికి మారుపేరు పినాకా LRGR :
డీఆర్డీఓ (DRDO) రూపొందించిన ఈ సరికొత్త రాకెట్ వేరియంట్, ప్రస్తుత పినాకా లాంచర్ల నుండే ప్రయోగించేలా డిజైన్ చేశారు. ప్రయోగించిన సమయం నుండి లక్ష్యాన్ని చేరుకునే వరకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థతో ఇది ప్రయాణించింది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ, దీనిని భారత సైన్యానికి “గేమ్ ఛేంజర్” అని అభివర్ణించారు. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.
రూ. 79,000 కోట్ల భారీ రక్షణ ప్యాకేజీ
పినాకా పరీక్ష విజయవంతమైన అదే రోజున, రక్షణ మంత్రి నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) మూడు సాయుధ దళాల కోసం రూ. 79,000 కోట్ల విలువైన సైనిక కొనుగోళ్లకు పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో దేశ రక్షణ సంసిద్ధత మరింత పెరగనుంది.
- భారత సైన్యం (Army):
పినాకా వ్యవస్థ కోసం లాంగ్ రేంజ్ గైడెడ్ మందుగుండు సామగ్రి. - వ్యూహాత్మక దాడుల కోసం ‘లాయిటర్ మునిషన్’ వ్యవస్థలు.
- డ్రోన్లను గుర్తించి, అడ్డుకునే సరికొత్త ‘డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్‌డిక్షన్ సిస్టమ్ Mk II’.
- భారత నౌకాదళం (Navy):
హిందూ మహాసముద్రంలో నిరంతర నిఘా కోసం ‘హై ఆల్టిట్యూడ్ లాంగ్ రేంజ్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్’ (HALE RPAS) లీజు. - సురక్షిత కమ్యూనికేషన్ కోసం ‘హై ఫ్రీక్వెన్సీ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోలు’.
- భారత వైమానిక దళం (Air Force):
శత్రు విమానాలను దూరం నుండే కూల్చేసే ఆస్ట్రా Mk II (Astra Mk II) క్షిపణులు. - తేజస్ ఫైటర్ పైలట్ల శిక్షణ కోసం ‘ఫుల్ మిషన్ సిమ్యులేటర్’.
- లాంగ్ రేంజ్ స్ట్రైక్ కోసం SPICE 1000 గైడెన్స్ కిట్లు.

