జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
Sanatana Dharma Rakshana Board | తిరుమల లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును వినియోగించారనే వార్తలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం తక్షణమే సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “తిరుపల వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపారని గుర్తించడంతో మేమంతా చాలా షాక్ కు గురయ్యాం. ” దిగ్భ్రాంతికరమైన నేరానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు బాధ్యత వహించాలని పవన్ అన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
We are all deeply disturbed with the findings of animal fat (fish oil,pork fat and beef fat )mixed in Tirupathi Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP Govt then. Our Govt is committed to take stringent action possible.
But,this throws… https://t.co/SA4DCPZDHy— Pawan Kalyan (@PawanKalyan) September 20, 2024
ముఖ్యంగా, దేవాలయాలను అపవిత్రం చేయడం, వారి భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతులతో సహా హిందూ సమాజానికి సంబంధించిన ఎన్నో సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎత్తి చూపారు “జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ (Sanatana Dharma Rakshana Board)ని ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైంది. మొత్తం భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి. విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా వర్గాలు కలిసి జాతీయస్థాయిలోచర్చకు పిలుపునిచ్చారు.
కాగా YSRCP అధికారంలో ఉన్నప్పుడు ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను తయారు చేయడానికి జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు గుజరాత్‌లోని సెంటర్-రన్ నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌లోని సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (CALF) ల్యాబ్ వెల్లడించింది. అంతకుముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పవిత్రమైన లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించిన మరుసటి రోజు సెప్టెంబర్ 19వ తేదీన ల్యాబ్ నుంచి ఈ షాకింగ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీంతో యావత్ హిందూ సమాజం దిగ్భ్రాంతికి గురైంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.