![Priyanka Gandhi](https://vandebhaarath.com/wp-content/uploads/2024/12/priyanka-gandhi.webp)
New Delhi : భారత పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్ (Palestine Bag) ను తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మద్దతు తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు లోపల పాలస్తీనా పేరు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లడంపై బిజెపి విమర్శించింది. ఇది ఓటు బ్యాంకు కోసం ఒక నిర్దిష్ట వర్గాన్నిఆకర్షించేందుకే ఆమె చర్యలను పేర్కొన్న అధికార పార్టీ బిజెపి సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ (Pakistan ) మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి మద్దతుగా నిలిచారు.
పార్లమెంట్ సమావేశంలో ప్రియాంకగాంధీ బ్యాగ్ తగిలించుకుని రావడం రచ్చ రాజుకుంది. దాని మీద “పాలస్తీనా” అని రాసి ఉంది. పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌తో ఉన్న ఆమెను బీజేపీ ప్రశ్నించడంతో ప్రియాంక స్పందించారు బిజెపి బుజ్జగింపు రాజకీయాలు అనే ఆరోపణపై ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ, ఈ “చెత్త” గురించి మాట్లాడే బదులు, బంగ్లాదేశ్‌లో, మైనారిటీలు, హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో మాట్లాడాలని ఆమె నొక్కి చెప్పారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు.. దీనికి సంబంధించి ఏదైనా చేయాలి.. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరపాలి.. అలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడకూడదని వాద్రా పార్లమెంటు ఆవరణలో విలేకరులతో అన్నారు.
బిజెపి నేతల ఫైర్
అయితే ప్రియాంక వ్యాఖ్యలపై బిజెపి (BJP) ఫైర్ అయింది. ప్రియాంకగాంధీ చర్య పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్లు సూచిస్తుందని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ తమను చిక్కుల్లో పడేసి ఓట్లను పొందేందుకు వివిధ ఎజెండాలను ఉపయోగిస్తుందని అన్నారు. మనోజ్ తివారీ మాట్లాడుతూ, “కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుంది. వారు ముస్లిం సమాజానికి మేలు చేయరు. వారిని చిక్కుల్లో పెట్టి ఓట్లు రాబట్టుకునేందుకు రకరకాల ఎజెండాలను ఉపయోగించుకుంటున్నారు. నెహ్రూ జీ, ఇందిరాజీ, రాజీవ్ జీ వాడిన ‘గరీబీ హటావో’, ప్రస్తుతం రాహుల్, ప్రియాంక జీ ఇద్దరూ ఉపయోగిస్తున్న కాంగ్రెస్ జిమ్మిక్ గురించి ప్రధాని మోదీ చెప్పారని గుర్తుచేశారు.
పాలస్తీనా (Palestine) అని రాసి ఉన్న బ్యాగ్‌ని వాద్రా తీసుకెళ్లడం కేవలం యాదృచ్చికం కాదని, సందేశం ఇవ్వడానికి చేసిన ప్రయత్నమని కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ భాగెల్ పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా ముస్లిం ఓటర్లను బుజ్జగించేందుకు, సంతృప్తి పరిచేందుకు, పోలరైజ్ చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
బాఘేల్ ANIతో మాట్లాడుతూ, “ఇది కేవలం యాదృచ్చికం కాదు, బదులుగా ఇది ఒక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆగ్రా, కాన్పూర్, చెన్నై మొదలైన అనేక నగరాల్లో తయారవుతున్న ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన భారతీయ బ్యాగ్‌ని ఆమె తీసుకువెళ్లినట్లయితే. ఆమె ‘స్వదేశీ’ ఉత్పత్తిని ఉపయోగించగలిగితే, అది పరిశ్రమకు భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. .. పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్‌ని పెట్టుకుని ముస్లిం ఓట్లను సంతృప్తి పరచడానికి, పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.