Posted in

Operation Sindoor : ఉగ్ర శిబిరాలు ధ్వంసం, 90 మంది ఉగ్రవాదులు హతం?

Operation Sindoor
Operation Sindoor
Spread the love

Operation Sindoor Live updates : పహల్గామ్ లో 26 మంది అమాయకుల ఊచకోతకు ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని బహల్పూర్‌లో 90 మందికి పైగా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న క్రూరమైన పహల్గామ్ ఊచకోతకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (Pok)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ బుధవారం తెల్లవారుజామున క్షిపణి దాడులు (Operation Sindoor) నిర్వహించింది. వీటిలో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద స్థావరంగా పిలువబడే బహల్పూర్ కూడా ఉంది.

పాకిస్తాన్, పీఓకేలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడులు (India Attacks Pakistan) నిర్వహించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్‌ కు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పాలనే దానిపై నిరంతరం చర్చ జరుగుతోంది. ఈక్రమంలో భారత సైన్యం పాకిస్తాన్, పిఓకె(POK)లో బుధవారం అర్ధరాత్రి ఉగ్రవాద స్థావరాలపై (Terrorist camps) సైనిక చర్య చేపట్టింది. దీని కారణంగా, పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థలకు వణుకు మొదలైంది.

భారతదేశం ఈ దాడిని పాకిస్తాన్‌పై కాదు, ఆ దేశం నేలపై పనిచేస్తున్న ఉగ్రవాద స్థావరాలపైనే చేసిందన్నదని స్పష్టంగా తెలుస్తుంది. భారత సైన్యం తన వైమానిక దాడులను ఉగ్రవాదుల స్థావరాలకే పరిమితం చేసింది. మూలాల ప్రకారం, భారత సైన్యం వైమానిక దాడులు చేసిన 9 ఉగ్రవాద స్థావరాలలో 4 ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందినవి. ఇది కాకుండా, లష్కరే తోయిబాకు చెందిన మూడు ఉగ్రవాద స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. 2 రహస్య స్థావరాలు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందినవి.

భారత సైన్యం వైమానిక దాడులు చేసిన పాకిస్తాన్‌లోని నాలుగు ఉగ్రవాద స్థావరాలు బహవల్‌పూర్, మురిడ్కే, చక్ అమ్రు, సియాల్‌కోట్‌లలో ఉన్నాయి. పీఓకేలో లక్ష్యంగా చేసుకున్న 5 ఉగ్రవాద స్థావరాలు ముజఫరాబాద్, బాగ్, కోట్లి, గుల్పూర్, భీంబర్‌లలో ఉన్నాయి.

90 మంది ఉగ్రవాదులు హతం?

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కింద భారత సైన్యం పాకిస్తాన్‌పై నిర్వహించిన వైమానిక దాడి పాకిస్తాన్ వెన్ను విరిచింది. వైమానిక దాడుల ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ ఉగ్రవాద స్థావరాలలో దాక్కున్న 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పలు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *