Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

J&K Elections 2024 | ‘భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని మ‌ళ్లీ తీసుకురాదు’

Spread the love

J&K Elections 2024 | జ‌మ్మూక‌శ్మీర్ లో ఆర్టికిల్ 370 ర‌ద్దుపై ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం క‌శ్మీర్‌లోని కత్రాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఏ బాహ్య శక్తి పునరుద్ధరించడం సాధ్యం కాదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో వివాదాస్పద రాజకీయ వాతావరణం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి పీఎం మోదీ మాట్లాడుతూ.. క‌శ్మీర్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఎన్‌సి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు పాకిస్తాన్ రక్షణ మంత్రి మద్దతు ఇచ్చార‌ని, ఈ రెండు పార్టీలు పాకిస్థాన్ ఎజెండాను అమలు చేస్తున్నాయని మండిప‌డ్డారు. పాకిస్తాన్ ఎజెండాను J&Kలో అమలు చేయడానికి మేం ఎన్న‌టికీ స‌హించ‌లేమ‌ని అన్నారు. భూమ్మీద ఏ శక్తి ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేదన్నారు. .

నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్ పార్టీలు జమ్మూకాశ్మీర్‌లో అధికారంలోకి వస్తే వివాదాస్పద ఆర్టికిల్ 370ని పునరుద్ధరిస్తాయని ఆసిఫ్ చేసిన వాదనను మోదీ ఖండంచారు. కాగా 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంపై తీవ్ర చర్చ జరిగింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిని అప్ప‌ట్లో. పాకిస్తాన్ వ్య‌తిరేకించింది. అప్ప‌టి నుంచి ప్రాంతీయ రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా మిగిలిపోయింది.

రాహుల్ పై అమిత్ షా విమర్శలు

కాగా ఈరోజు తెల్లవారుజామున, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ అంశంపై స్పందించారు. ఖ్వాజా ఆసిఫ్ ప్రకటనలను విమర్శించారు. పాకిస్థాన్ ఎజెండాతో కాంగ్రెస్, ఎన్‌సీ పొత్తు పెట్టుకున్నాయని షా సోషల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేశారు. “ఆర్టికల్ 370 మరియు 35Aపై కాంగ్రెస్, JKNC మద్దతు గురించి పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ప్రకటన కాంగ్రెస్ వైఖ‌రిని మరోసారి బహిర్గతం చేసింది. కాంగ్రెస్‌, పాకిస్థాన్‌ల ఉద్దేశాలు, ఎజెండా ఒక్కటేనని ఈ ప్రకటన మరోసారి స్పష్టం చేసింది’ అని అమిత్ షా ఎక్స్‌లో రాశారు.

రాహుల్ గాంధీతోపాటు ఆయ‌న‌ పార్టీ.. భారత వ్యతిరేక శక్తుల పక్షాన నిలబడ్డారని ఆరోపించారు. భారత సైనిక కార్యకలాపాలపై గాంధీ గతంలో చేసిన విమర్శలను ఆయన గుర్తుచేశారు. కాశ్మీర్‌పై కాంగ్రెస్ వైఖరి పాకిస్తాన్ కు ప్రయోజనాలు చేకూర్చేలా ఉంద‌ని అన్నారు.
వైమానిక దాడులు, సర్జికల్ దాడులకు రుజువు అడగడం లేదా భారత సైన్యం గురించి అభ్యంతరకరమైన విషయాలు చెప్పడం, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ.. పాకిస్తాన్ వైపై ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంద‌ని తెలిపారు.

ఖవాజా ఆసిఫ్ ఏం చెప్పాడు

జియో న్యూస్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆర్టికల్ 370, 35Aకి సంబంధించి పాకిస్తాన్.. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి లక్ష్యాన్ని ఎంచుకున్నాయని ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు. “ఇది (ఆర్టికిల్ 370) సాధ్యమేనని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌కు అక్కడ చాలా ప్రాధాన్యం ఉంది. వీరు అధికారంలోకి వచ్చాక జమ్మూకశ్మీర్‌కు హోదాను పునరుద్ధరించాలని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుప‌రిచారు. ’ అని ఆసిఫ్ అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *