Aarogyasri Cards | త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు.. రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే..
Aarogyasri Cards | తెలంగాణలో నిరుపేదలకు శుభవార్త.. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారికి త్వరలో మంజూరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కొందరు పేదలకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. ఈ కార్డు లేని చాలా మంది తెల్ల రేషన్ కార్డు సాయంతోనే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. అయితే ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేప థ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీపై పై ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రత్యేకంగా దృష్టి సారించింది. లబ్ధిదారుల గుర్తింపుపై మార్గద ర్శకాలను రూపొందించడంలో నిమగ్నమైంది. అర్హులైన నిరుపేదలందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలని వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది.
ఏటా రూ.400 అదనపు భారం
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్దగా భారం కాబోదని ప్రభుత్వం భావిస్తోంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న కూడా చాలా మందే ఉన్నారు.. కానీ ప్రైవేట్ బీమా కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఈ నేప థ్యంలో ఆరోగ్యశ్రీ కార్డు (New Rajiv Aarogyasri Cards) లతో అందరికీ ఆరోగ్య సేవలు అందించాలని, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అదనంగా 100 శస్త్రచికిత్సలు
తెలంగాణలో సుమారు 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. ఈ పథకానికి సుమారు 77,19లక్షల మది అర్హులుగా ఉన్నారు. ఇందులో ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. ప్రస్తుతం.. ఆరోగ్యశ్రీ పథకం కింద 1376 రకాల ఆపరేషన్లు, 289 రకాల వైద్యసేవలు అందిస్తున్నారు.ఇక కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయుష్మాన్ భవ స్కీమ్ కింద 1949 రకాల వ్యాధులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..