
Aarogyasri Cards | త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు.. రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే..
Aarogyasri Cards | తెలంగాణలో నిరుపేదలకు శుభవార్త.. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారికి త్వరలో మంజూరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కొందరు పేదలకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. ఈ కార్డు లేని చాలా మంది తెల్ల రేషన్ కార్డు సాయంతోనే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. అయితే ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేప థ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీపై పై ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రత్యేకంగా దృష్టి సారించింది. లబ్ధిదారుల గుర్తింపుపై మార్గద ర్శకాలను రూపొందించడంలో నిమగ్నమైంది. అర్హులైన నిరుపేదలందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలని వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది.
ఏటా రూ.400 అదనపు భారం
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అ...