Posted in

Osmania | ఉస్మానియా ఆస్ప‌త్రికి సీఎం శంకుస్థాప‌న‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

Osmania Hospital
Osmania Hospital
Spread the love

హైదరాబాద్‌లోని గోషామహల్ కొత్త‌గా ఉస్మానియా ఆస్ప‌త్రి (New Osmania Hospital) నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister Revanth Reddy) తీవ్ర నిర‌స‌నలు, ఉద్రిక్త‌ల మ‌ధ్య ఈ రోజు శంకుస్థాప‌న చేశారు. ఈ ఆస్ప‌త్రి నిర్మాణాన్ని గోషామ‌హ‌ల్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మొద‌టి నుంచే వ్య‌తిరేకిస్తోంది. ఈ అంశాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిప‌ల్ కార్పొరేషన్ (GHMC) సాధారణ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా లేవ‌నెత్తారు. కొత్త‌గా నిర్మించ‌నున్న ఉస్మానియా ఆస్ప‌త్రిని ఇప్పుడున్న భ‌వ‌నం వెనుక భాగంలోనే క‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

New Osmania Hospital పై వ్య‌తిరేకత ఎందుకంటే..

గోషామ‌హ‌ల్ (Goshamahal) పోలీస్‌గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆస్ప‌త్రి క‌ట్ట‌డంతో ఆ ప్రాంతంలో ర‌ద్దీ పెరిగితే తీవ్ర ట్రాఫిక్ స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌నే అభ్యంత‌రం వ్య‌క్తమ‌వుతోంది. గోషామహల్ వాసులు, వ్యాపారులు ప‌లువురు ఈ నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ముఖ్యంగా గోషామహల్ రహదారి ఇప్పటికే ట్రాఫిక్ భరించలేనంతగా ఉందని, ఆస్ప‌త్రి నిర్మాణం జరిగితే పరిస్థితి మరింత తీవ్ర‌త‌రం అవుతుంద‌ని అంటున్నారు. దీని వ‌ల్ల తాము ఉపాధిని కోల్పోతామ‌ని చిరు వ్యాపారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న‌తో అప్ర‌మ‌త్త‌త‌

కొత్త‌గా నిర్మించ‌నున్న ఉస్మానియా ఆస్ప‌త్రికి వ్యతిరేకంగా గోషామహల్ పరిరక్షణ సమితి శుక్రవారం బంద్ (bandh)కు పిలుపునిచ్చింది. ఈ సంద‌ర్భంగా నిర‌స‌న‌లు చేప‌ట్ట‌గా ఉద్రిక్త‌లు చోటుచేసుకున్నాయి. ఉస్మానియా ఆస్ప‌త్రి శంకుస్థాప‌న‌ను అడ్డుకుంటామ‌ని గోషామహల్ పరిరక్షణ సమితి అధ్య‌క్షుడు పురుషోత్తం ప్ర‌క‌టించ‌గా ఆయ‌న్ను పోలీసులు గృహ‌నిర్బంధంలో ఉంచారు.

ఆధునిక వైద్య సేవ‌లే ల‌క్ష్యం : సీఎం

గోషామ‌హ‌ల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆస్ప‌త్రి నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు శంకుస్థాప‌న చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలను అందించే క్ర‌మంలో ఉస్మానియా ఆస్పత్రిని ఆధునీకరించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్న‌ట్టు చెప్పారు. 2 వేల పడకల సామర్థ్యంతో 30 వైద్య విభాగాల సేవలను అందుబాటులోకి తెస్తున్న‌ట్టు తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *