Sunday, September 7Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Bank holidays in October 2023 :  12 రోజుల పాటు బ్యాంకులకు సెలువులు.. రాష్ట్రాల వారీగా జాబితా చూడండి

Bank holidays in October 2023 : 12 రోజుల పాటు బ్యాంకులకు సెలువులు.. రాష్ట్రాల వారీగా జాబితా చూడండి

National
Bank holidays in October 2023 :  అక్టోబరు నెలలో బ్యాంకులు కొన్ని రోజులు మూతపడనున్నాయి. వచ్చే నెలలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పనులు మొదలుపెట్టే ముందు ఒకసారి ఈ సెలవుల జాబితాను పరిశీలించండి. అక్టోబరులో బ్యాంకులకు రికార్డు స్థాయిలో సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి అన్ని జాతీయ సెలవులు, కొన్ని ప్రాంతీయ సెలవు దినాలలో బ్యాంకులకు మూసివేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ సెలవులను నిర్ణయిస్తాయి. ఈ జాబితా ప్రకారం, అక్టోబర్ 2023లో 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి.మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.అక్టోబర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు సెలవుల లిస్ట్ అక్టోబర్ 2 (సోమవారం)- గాంధీ జయంతి - జాతీయ సెలవు అక్టోబర్ 12 (ఆదివారం)- నరక చతుర్దశి అక్టోబర్ 14 (శనివారం)- మహాలయ- కోల్‌కతాలో బ్యాంకులు ...
Manipur violence: అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా.. సోషల్ మీడియాలో కలకలం రేపిన ఫోటోలు

Manipur violence: అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా.. సోషల్ మీడియాలో కలకలం రేపిన ఫోటోలు

National
Manipur violence: జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు మణిపురి విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమావడం సంచలనం రేపింది.. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి..ఒక చిత్రంలో ఇద్దరు విద్యార్థులు నేలపై కూర్చున్నట్లు చూపించారు, వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు కనిపిస్తున్నారు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో చిత్రంలో ఇద్దరు విద్యార్థులు విగతజీవులుగా  పడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.విద్యార్థులను 17 ఏళ్ల హిజామ్ లింతోంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్‌గా గుర్తించారు.ఈ చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించిన తర్వాత, విద్యార్థుల కిడ్నాప్  హత్యకు పాల్పడిన వారందరిపై వేగంగా చర్యలు తీసుకుంటామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రజలకు హామీ ఇచ్చారు.జులై 2023 నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులు ఫిజామ్ హేమ్‌జిత్, 20, హిజామ్ లింతోంగంబి (17)ల ఫోటోలు సోషల్ మీడియాలో ప్...
Rozgar Mela 2023 : ఈరోజు కొత్తగా చేరిన 51,000 మంది ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ

Rozgar Mela 2023 : ఈరోజు కొత్తగా చేరిన 51,000 మంది ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ

National
Rozgar Mela 2023 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన రిక్రూట్‌మెంట్లకు సుమారు 51,000 అపాయింట్‌మెంట్ లెటర్‌(Appointment Letters)లను పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 46 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా జరగనుంది. రిక్రూట్‌మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలలో జరుగుతోంది. కొత్త రిక్రూట్‌లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిఫెన్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ, ఆరోగ్యం- కుటుంబ సంక్షేమం వంటి వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో కొత్త ఉద్యోగులు చేరనున్నారు.“రోజ్‌గార్ మేళా(Rozgar Mela 2023) అనేది.. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రధాన మంత్రి ఆలోచనకు అనుగుణంగా వేసిన ఒక అడుగు. రోజ్‌గార్...
11 రాష్ట్రాలలో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం.. రైళ్ల వివరాలు ఇవీ..

11 రాష్ట్రాలలో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం.. రైళ్ల వివరాలు ఇవీ..

National
Vande Bharat Express trains : దేశంలోని 11 రాష్ట్రాల్లో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. తొమ్మిది వందే భారత్ రైళ్ల వివరాలుహైదరాబాద్-బెంగళూరు (Hyderabad-Bengaluru) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా) (Vijayawada-Chennai ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయపూర్-జైపూర్ (Udaipur-Jaipur ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తిరునెల్వేలి-మధురై-చెన్నై(Tirunelveli-Madurai-Chennai  )వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పాట్నా-హౌరా (Patna-Howrah ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాసరగోడ్-తిరువనంతపురం (Kasaragod-Thiruvananthapuram ) వందే ...
30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

National
భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.  చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా  215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా ఓటు వేయలేదు. అయితే రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో సగానికిపైగా రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే బిల్లు పూర్తి చట్టంగా మారుతుంది. కాగా ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా మహిళా రిజర్వేషన్లు అమలు కావడానికి సంవత్సరాలు పడుతుంది. తర్వాతి జనాభా గణంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్యయ్యాకే మహిళా రిజర్వేషన్ (Women's Reservation Bill) అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.నారీ శక్తి వందన్ అధినియమ్ (Nari Shakti Vandan Adhiniyam) పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సుమారు 10 గంటల పాటు సుదీర్...
ఆది శంకరాచార్య 108 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ..

ఆది శంకరాచార్య 108 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ..

National
Adi Shankaracharya Statue :  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓంకారేశ్వర్ లో 8వ శతాబ్దానికి చెందిన గొప్ప వేద పండితులు, గురువు ఆదిశంకరాచార్య 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 'దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం ‘Statue of Oneness’ )' అని పేరుపెట్టారు. ఈ విగ్రహాన్ని నర్మదా నది ఒడ్డున గల ఓంకారేశ్వర్ లోని మాంధాత పర్వతంపై నిర్మించారు. అనేక లోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం 54 అడుగల ఎత్తైన పీఠంపై ఉంది. దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం) అని పేరుపెట్టారు. ఓంకారేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శివుడిని ఆరాధించే పవిత్ర క్షేత్రం ఇది. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఓంకారేశ్వర్ లో ఓ మ్యూజియంతో పాటు ఆదిశంకరాచార్య విగ్రహం కోసం రూ.2,141.85 కోట్ల ప్రాజెక్టుకు గత సంవత్సరం ఆమోదం తెలిపింది. నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్ ఇండోర్ ...
మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్.. కేవలం 8.30 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..

మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్.. కేవలం 8.30 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..

National
హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (Vande Bharat Express) ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు(Bengaluru) నగరాలను వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనుసంధానం చేసేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. .సెప్టెంబర్ 24న ఢిల్లీ నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 25 నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే కార్యక్రమానికి ఈ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తోపాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య మధ్య 609 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది.రైలు నెంబరు 20703 కాచిగూడ - యశ్వంత్‌పూర్‌(Yeswantpur ) కాచిగూడ( Kacheguda )లో ఉదయం 5.30 గంట...
vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.

vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.

National, Special Stories
Vinayaka Chavithi: వరంగల్: వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. ఇప్పటికే అందరూ పూజా సామాగ్రి కొనుగోళ్లలో నిమగ్నమై పోయారు. ఈరోజు చేసే వినాయక పూజలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినాయక వ్రత కథ (Vinayaka Chavithi vratham) గురించి.. ఈ కథను విన్నా.. చదివినా.. నీలాపనిందలకు దూరంగా ఉండొచ్చని సాక్షాత్తూ శ్రీకృష్ణుడు తెలిపాడు. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుని.. నిందలకు దూరంగా ఉందాం.. వినాయకుడి చరిత్ర (Vinayaka Chavithi story) వినాయక చవితి పండుగ (Ganesh chathurthi) రోజు కచ్చితంగా వినాయక వ్రత కథ చదవాల్సిందే.. లేదా వినాల్సిందే అంటున్నారు వేద పండితులు. దీనివల్ల భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. వినాయక వ్రతకథ చదివేవారు.. లేదా పూజల్లో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై వేసుకోవాలి.ఇప్పుడు కథలోకి వెళ్దాం.. పురాణాల ప్రకారం... తన భక్తుడైన ...
మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

National
ఢిల్లీలో అంతర్జాతీయస్థాయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో  సెంటర్ 8 అంతస్తుల్లో కన్వెన్షన్ హాళ్లు, బాల్ రూం, మీటింగ్ హాల్స్ 8.9లక్షల చదరపుమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కేంద్రం 17న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభంన్యూఢిల్లీ : అత్యంత ఆకర్షణీయ నిర్మాణాలు, పర్యాటక క్షేత్రాలకు నిలయమైన ఢిల్లీలో మరో అద్భుత నిర్మాణం యశోభూమి (YashoBhoomi) అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరు 17వ తేదీ ఆదివారం నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యశోభూమి పేరుతో నిర్మించిన అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఇది ఫేజ్ 1 ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) 'అని పిలుస్తారు.దేశంలో సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రధానమంత్రి ఆలోచనతో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల ప్రా...
అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. మరోచోట సజీవంగా దొరికాడు.

అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. మరోచోట సజీవంగా దొరికాడు.

National
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన లక్నో: హత్యకు గురైన యువకుడి మృతదేహానికి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అతడు మరోచోట సజీవంగా కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ముజఫర్‌నగర్‌ (Muzaffarnagar)  జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఆగస్టు 31న 18 ఏళ్ల వయసున్న మోంటూ, అదే వయసు గల యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. అయితే తమ కుమార్తెను మోంటు కిడ్నాప్ చేసినట్లు ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ జంట ఆచూకీ కనుగొనేందుకు పోలీస్ బృదాలను ఏర్పాటు చేశారు.కాగా, సెప్టెంబర్ 13న మోంటూ కుటుంబ సభ్యులకు మీరట్‌ (Meerut) పోలీసులు ఫోన్ చేశారు. కాలువలో తల లేని యువకుడి మృతదేహం లభ్యమైందని దానిని గుర్తించాలని పిలిపించారు. దీంతో వెంటనే మార్చురీకి తల్లిదండ్రులు వెళ్లారు. మృతదేహంపై టాటూను చూసి ఆ మృతదేహం మోం...