Wednesday, September 10Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Maha Lakshmi Scheme | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాల్సిందే..

Maha Lakshmi Scheme | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాల్సిందే..

National
ఆటో కార్మికులు, క్యాబ్ డ్రైౌవర్ల డిమాండ్.. బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సర్వత్రా నిరసన గిరాకీ లేక రోడ్డున పడుతున్నాం.. అప్పులకు కిస్తీలు కూడా కట్టలేపోతున్నాం.. బస్ భవన్ ముట్టడిలో ఆటో కార్మికుల ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనహైదరాబాద్‌: మహాలక్ష్మి పథకం (Maha Lakshmi Scheme) లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో ఆటో డ్రైవర్ల జీవితాలపై పెను ప్రభావం చూపింది.. ఉచితం కావడంతో మహిళలు బస్సు ప్రయాణాల వైపు మొగ్గు చూపడంతో ఆటోలకు పని లేకుండా పోయింది. ఫలితంగా డ్రైవర్లు (Auto drivers) అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇటు ప్రయాణికులు లేక ఆటోల ద్వారా ఆదాయం కోల్పోవడం మరో బతుకు దెరువు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటివరకు రహదారులపై రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా మంగళవారం హైదరాబాద్ లో బస్ భవన...
PM Modi : అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi : అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

National
PM Modi..Biggest Meditarion center in Varanasi : ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరం అందుబాటులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్వవేద్ మహామందిర్ లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. 7 అంతస్తుల్లో నిర్మించిన ఈ మందిరంలో 20,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునేందుకు వీలుంటుంది. ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM modi ) మాట్లాడుతూ.. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించినప్పుడు తాను ఎంతో మంత్రముగ్ధుడినయ్యానని.. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతం, రామాయణం వంటి దైవిక బోధనలు మహామందిర్ గోడలపై చిత్రాలుగా ఏర్పాటు చేయటం చూసి చాలా ఆనందంగా ఉందని అన్నారు. సాధువుల మార్గదర్శకంలో కాశీ ప్రజలు అభివృద్ధి.. నవ నిర్మాణ పరంగా కొత్త రికార్డులు సృష్టించారని అన్నారు. సర్వవేద్ మహామందిర్ దీనికి ఉదాహరణ అని కొనియాడారు. కాశీలో గడిపిన ప్రతీ క్షణం అద్భుతంగా ఉంటుందని ప్రధాని మోదీ ...
Article 370  | ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

Article 370 | ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

National, Trending News
Article 370 | జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir) అంశంపై రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది.కాగా ఆర్టికల్‌ 370 (Article 370) ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం జరిగిందని తెలిపింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలూ కశ్మీర్‌కు వర్తిస్తాయని, మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం...
Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్..  అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..

Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్.. అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..

National
లక్నో: అధికార దుర్వినియోగం, పనిలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను యోగి ఆదిత్యనాథ్ (Adithyanath) నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. విధుల నుంచి తొలగించబడిన వారిలో Utter Pradesh ముజఫర్‌నగర్‌కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా కూడా ఉన్నారు.బల్లియాలో విధులు నిర్వర్తిస్తున్న  కన్సాలిడేషన్ ఆఫీసర్ శివశంకర్ ప్రసాద్ సింగ్ వార్షిక వేతన పెంపును కూడా ప్రభుత్వం నిలిపివేసింది. మీరట్ నుంచి అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నీరజ్‌ను కూడా తొలగించింది. ఇంకా, కన్సాలిడేషన్ ఆఫీసర్ అవదేశ్ కుమార్ గుప్తా, అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ కుమార్‌లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.  యాదవ్, అఖిలేష్ కుమార్ పనిలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. నితిన్ చౌహాన్‌పై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించినట్లు కన్సాలిడేషన్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ విలేకరులతో అ...
‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం : అమిత్‌ షా

‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం : అమిత్‌ షా

National
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ముమ్మాటికీ మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు . భారత్‌లో అతర్భాగమైన పీవోకేలో 24 సీట్లు రిజర్వ్‌ చేసినట్లు వెల్లడించారు.  తాజాగా రెండు ‘నయా కశ్మీర్’ బిల్లులను (‘Naya Kashmir’ Bills) కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.Naya Kashmir Bills జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ము కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు- 2023పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో ప్రసంగించారు. జమ్ముకశ్మీర్‌లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లులు తగిన న్యాయం చేస్తాయన్నారు. కశ్మీర్‌లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47 కు పెంచినట్లు చెప్పారు.  అదేవిధంగా జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43 కు పెంచినట్లు వివరించారు.. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) కూడా మనదేనని.. అందుకే ఆ ప్రాంతంలో 24 సీట్లు రిజర్వ్‌ చే...
Election Results 2023: డబుల్ ఇంజన్ సర్కారు ట్రిపుల్ విక్రరీ..

Election Results 2023: డబుల్ ఇంజన్ సర్కారు ట్రిపుల్ విక్రరీ..

National
Election Results 2023 : రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. మూడు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇందులో అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లను హస్తం పార్టీ కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆయా రాష్ర్టాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు చేసుకొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలు నిర్మానుష్యంగా వెలవెలబోయి కనిపించాయి.మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఐదోసారి..Election Results 2023 : మధ్యప్రదేశ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 230 సీట్ల అసెంబ్లీలో 163 ​​సీట్లను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విజయానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కారణమన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ 66 స్థానాలను గెలుచుకుంది. భారత్ ఆదివాసీ పార్టీ తన తొలి విజయాన్ని రు...
MLA’s List | తెలంగాణలో విజయం సాధించిన అభ్యర్థుల జాబితా..

MLA’s List | తెలంగాణలో విజయం సాధించిన అభ్యర్థుల జాబితా..

National
Telangana Assembly Elections Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో క్లారిటీ వచ్చేసింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఫలితంతో మొదలైన కాంగ్రెస్ విజయ ప్రస్థానం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో విజయం ఢంకా మోగించింది. 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 60 పైగా స్థానాల్లో గెలుపొందగా.. మేజిక్‌ ఫిగర్‌ను సులువుగా అందుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుంది. .MLA's List : ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇవీ..[table id=16 /] ...
Mahant Balak Nath | యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?

Mahant Balak Nath | యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?

National
రాజస్తాన్ లో మరో యోగీ.. సీఎం పదవి రేసులో మహంత్ బాలక్ నాథ్.. Rajasthan Assembly Election: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోయింది. విజయం దాదాపు ఖరారయ్యింది. కాగా.. ఊహించని విధంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి రేసులోకి ఓ సన్యాసి తెరపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.రాజస్తాన్ లో బీజేపీ విజయం ఖాయమైన క్రమంలో ఇప్పుడు సీఎం ఎవరు అవుతారనేదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే సీఎం రేసులో వసుంధర రాజే ముందుండగా మరోవైపు మహంత్ బాలక్ నాథ్ (Mahant Balak Nath) కూడా తెరపైకి వచ్చారు. ఆయనకు ఆర్ఎస్ఎస్, బీజేపీ అధిష్ఠానం ఆశీస్సులు ఉండడండంతో అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకువచ్చారు.40 ఏళ్ల మహంత్ బాలక్ నాథ్ రాజస్తాన్ (Rajasthan) లోని అల్వార్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తిజార (Tijara) సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఆయన రాజస్తా...
vande sadharan :  వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..

vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..

National
వందే సాధారణ్‌ ఎక్స్ ప్రెస్‌ ప్రత్యేకతలు ఇవే.. vande sadharan: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందేభారత్‌ ఎక్స్ ప్రెస్‌ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంది. వీటికి విలాసవంతమైన సెమీ హై స్పీడ్‌ రైళ్లుగా పేరుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే.. హైస్పీడ్ తో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేరవేస్తుంది. అయితే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ కోచ్ లు లేవు. అందుకే రాత్రి ప్రయాణం ఇందులో వీలు లేదు.. ఈ క్రమంలోనే సాధారణ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే వందే సాధారణ్‌ ఎక్స్ ప్రెస్‌ రైళ్లను తీసుకొస్తోంది భారతీయ రైల్వే. స్లీపర్‌ క్లాస్ లో ప్రయాణించే కార్మికులను దృష్టిలో ఉంచుకుని వీటిని తయారుచేశారు. సాధారణ్ లో సౌకర్యాలు ఏమున్నాయి.? కాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోలిస్తే.. వందే 'సాధారణ్ '(Vande Sadharan) రైళ్లు కాస్త భిన్నంగా ఉంటాయి. వందే సాధారణ్‌ రైళ్లు దాదాపుగా 800 కిలోమీటర్ల...
Jio AirFiber plans in 2023: నెలవారీ వార్షిక జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ధరలు, ఆఫర్‌లు ఫుల్ డీటెయిల్స్..

Jio AirFiber plans in 2023: నెలవారీ వార్షిక జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ధరలు, ఆఫర్‌లు ఫుల్ డీటెయిల్స్..

National, Technology
ఇటీవల రిలయన్స్ ప్రవేశపెట్టిన ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ Jio AirFiber.. మెరుపు-వేగంతో 5G ఇంటర్నెట్‌ను వైర్‌లెస్‌గా అందిస్తోంది. ఈ కొత్త తరహా సర్వీస్ మీ గృహ పరికరాలను ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడానికి సంప్రదాయ వైర్డు (డేటా కేబుల్) బదులుగా ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA)ని ఉపయోగిస్తుంది. ఇది మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ని ప్రారంభించడానికి రూటర్‌ని ప్లగ్ చేసినంత సులభం. మీరు ఈ బ్రాడ్‌బ్యాండ్ సేవను పరిశీలిస్తే.. మనకు అందుబాటులో ఉన్న Jio AirFiber ప్లాన్‌లకు సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. వాటి ప్రయోజనాలు, ధరలు, OTTలు ఒకసారి చూద్దాం.. Jio AirFiber వార్షిక నెలవారీ ప్లాన్‌లు: రూ. 599 అపరిమిత డేటా 30Mbps ఇంటర్నెట్ వేగం 550+ టీవీ ఛానెల్‌లు 14 OTT యాప్‌లకు యాక్సెస్ 30 రోజులురూ. 899 అపరిమిత డేటా 100Mbps ఇంటర్నెట్ వేగం 550+ టీవీ ఛానెల్‌లు 14 OTT యాప్‌లకు యాక్సెస్ 30 రోజులురూ. 1...