
భారత్‌లో హైస్పీడ్ రైళ్ల విషయానికొస్తే రాజధాని, శతాబ్ది పేర్లు వెంటనే గుర్తుకొస్తాయి. కానీ భారతీయ రైల్వేలలో ఇపుపుడు పూర్తిగా మారిపోయింది. నేడు దేశంలో అత్యంత వేగవంతమైన రైలు సాంప్రదాయ ఎక్స్‌ప్రెస్ కాదు, ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌లో నడుస్తున్న ఆధునిక “నమో భారత్” (Namo Bharat ). ఇది 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది.
దీనికి ముందు, 2016లో ప్రారంభమైన గతిమాన్ ఎక్స్‌ప్రెస్ వేగవంతమైన రైలుగా గుర్తంపు పొందింది. ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు.. హజ్రత్ నిజాముద్దీన్ – ఆగ్రా మధ్య 160 కి.మీ. వేగంతో నడుస్తోంది. తరువాత, వందే భారత్ రైళ్లు కూడా ఈ గరిష్ట వేగానికి సరిపోయాయి. అయితే, జూన్ 24, 2024న, రైల్వే మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని పేర్కొనకుండా దాని గరిష్ట వేగాన్ని 160 కి.మీ. నుంచి 130 కి.మీ.కి తగ్గించింది. ప్రస్తుతం, భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోని అన్ని రైళ్లు గరిష్ట వేగ పరిమితి 130 కి.మీ.తో నడుస్తాయి.
నమో భారత్ మార్గాలు
ప్రస్తుతం, తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సౌత్ మధ్య 30 నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ప్రతి స్టేషన్ నుండి 15 నిమిషాల విరామంలో నడుస్తాయి. ఈ మార్గంలోని కొన్ని ప్రాంతాలలో, రైళ్లు కొన్ని సెకన్ల పాటు 160 కి.మీ. గరిష్ట వేగాన్ని నమోదు చేస్తాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌సిఆర్‌టిసి) అధికారుల ప్రకారం, పూర్తి కారిడార్ ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మోడీపురం నుండి 82.15 కిలోమీటర్లలో 16 స్టేషన్ల ద్వారా కలుపుతుంది.
Namo Bharat : ఢిల్లీ-మీరట్ ప్రయాణానికి గేమ్-ఛేంజర్
ఈ కారిడార్ మొత్తం పూర్తయిన తర్వాత నమో భారత్ రైళ్లు ఢిల్లీని చారిత్రాత్మక నగరం మీరట్ తో కలుపుతాయని NCRTC తెలిపింది. ఈ మార్గంలోని అన్ని స్టేషన్లలో ఆగుతూ ప్రయాణం ఒక గంట కంటే తక్కువ సమయం పడుతుంది. ఈ సేవ ప్రయాణ సమయాన్ని చాలా వరకు తగ్గిస్తుందని, కనెక్టివిటీని పెంచుతుందని ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. “ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మోడీపురం వరకు 16 స్టేషన్లతో కూడిన మొత్తం 82.15 కి.మీ. పొడవైన కారిడార్ త్వరలో ప్రారంభించబడే అవకాశం ఉంది” అని NCRTCL అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.