నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య వందే భారత్..! టికెట్ ధరలు.. టైమింగ్స్, హాల్టింగ్ వివరాలు ఇవే..
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ తెలంగాణకు మరో కొత్త వందేభారత్ రైలును ప్రారంభించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైళ్లు ప్రయాణకులకుసేవలందిస్తున్నాయి. కాగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య తొలి వందే భారత్ రైలు కూడా ఉంది.
ఇక ఈ రైలు ఈ నెల 19 నుంచి అందుబాటులో వస్తుంది. ప్రతి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నాగ్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుంది. 5.43 గంటలకు సేవ్‌గ్రామ్ స్టేషన్ కు చేరుతుంది. అక్కడి నుంచి 7.03 గంటలకు చంద్రాపూర్‌కు చేరుకొని.. 7.05 గంటలకు బయలు దేరుతుంది. 7.20 గంటలకు బల్హార్షా చేరుకొని.. 7.25 గంటలకు బయలుదేరి.. 9.08గంటలకు పెద్దపల్లి జిల్లా రామగుండం స్టేషన్‌కు వస్తుంది. 10.04 గంటలకు కాజీపేట, మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఒంటిగంటకు బయలుదేరి.. ఆయా స్టేషన్ల మీదుగా రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది.
👇Timings of Nagpur – Secunderabad – Nagpur Vande Bharat Express
👉 Worlds class features
👉 Advanced safety system#RapidRail#VandeBharatExpress pic.twitter.com/amDX5KhKli— South Central Railway (@SCRailwayIndia) September 16, 2024
Vande Bharat Train 20 కోచ్‌లతో ఈ కొత్త వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో రెండు ఎగ్జిక్యూటివ్, 18 చైర్ కార్ కోచులు ఉంటాయి. కాగా ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే పరిధిలో కేవలం 16, ఎనిమిది కోచ్‌లతో మాత్రమే వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలుకు అత్యధికంగా మాత్రం 20 కోచ్‌లు ఉండనున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..