Wednesday, December 31Welcome to Vandebhaarath

పోలీసులపైనే వేటకొడవల్లతో దాడి.. ఎంకౌంటర్ లో ఇద్దరు కరడుగట్టిన నేరస్థుల మృతి

Spread the love

చెన్నై సమీపంలోని గుడువాంచేరిలో మంగళవారం వాహన తనిఖీ డ్యూటీ లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై  ఇద్దరు రౌడీ షీటర్లు వేట కొడవల్లతో దాడి చేయడంతో  పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరు  చనిపోయారు. మృతులు రమేష్, చోటా వినోద్ ఇద్దరూ కరడుగట్టిన నేరస్థులు.. వీరిపై గతంలో హత్య, దోపిడీ, గూండాయిజం వంటి పలు కేసులు నమోదయ్యాయి.

Highlights

ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వేగంగా వచ్చిన బ్లాక్ స్కోడా కారు సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. అయితే కారు అతనికి బదులుగా పోలీసు జీపును ఢీకొట్టింది.

నలుగురు వ్యక్తులు కారులోంచి దూకి పోలీసులపై దాడి చేయడంతో శివగురునాథన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. అతని తలపై దాడికి యత్నించగా, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కిందపడిపోయాడు.

దీంతో అప్రమత్తం అయిన శివగురునాథన్, మురుగేశన్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు హిస్టరీ-షీటర్లు రమేష్ (35), చోటా వినోద్ (32) గాయపడ్డారు.

అనంతరం ఇద్దరినీ చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

చోటా వినోద్‌పై A+ కేటగిరీ నిందితుడిగా 50కి పైగా కేసులు నమోదు చేయబడ్డాయి, ఇందులో 16 హత్యలు, 10 హత్యాయత్నాలు, 10 దోపిడీ మరియు 15 గూండాయిజం కేసులు ఉన్నాయి.

మరోవైపు రమేష్‌పై ఆరు హత్యలు, ఏడు హత్యాయత్నాలు, ఎనిమిది గూండాయిజం కేసులు సహా 20కి పైగా కేసులు ఉన్నాయి.

ఘటనా స్థలం నుంచి పారిపోయిన మరో ఇద్దరు నేరగాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను చికిత్స నిమిత్తం క్రోమ్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *