ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..
- కమ్ముకుంటున్న కరువు భయాలు
- ఎన్నికలు సమీపిస్తున్న వేళ BRSలో కలవరం
హైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలో తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడడం అధికార బీఆర్‌ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. నీటిపారుదల, తాగునీరు, పశుగ్రాసంపై కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
2014 నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున కరువు పరిస్థితులు రాలేదు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఏర్పడితే, BRS ప్రభుత్వం అనావృష్టిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అవుతుంది. వెంటనే వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని నాయకత్వం ఆశాభావంతో ఉంది.
2015 జూన్ జులైలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు కొంతమేర నష్టాన్ని పూరించాయని గుర్తుచేశారు.
రాష్ట్ర జనాభాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. కరువు కారణంగా వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, ఆర్థిక సమస్యలు, గ్రామీణ ప్రజలలో అశాంతికి దారితీస్తుంది. అటువంటి పరిస్థితి అధికార పార్టీపై వ్యతిరేక ఆలోచనకు ఆజ్యం పోస్తుందని బీఆర్ఎన్ నేతలకు భయపట్టుకుంది.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 2002, 2003లో తీవ్ర కరువు తర్వాత జరిగిన 2004 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఓడిపోయిన సంఘటనలను తలవంచిన గుర్తు చేసుకున్నారు.
ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2022-23 సామాజిక ఆర్థిక దృక్పథం (socio economic outlook) ప్రకారం, ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడిస్దే (GSVA) సేవల రంగం 62.8 శాతం వాటాను కలిగి ఉంది, తరువాత పరిశ్రమలు 19 శాతం, వ్యవసాయం, అనుబంధ రంగం 2022-23లో 18.2 శాతం. వ్యవసాయం యొక్క వాటా చిన్నదిగా అనిపించినా, ఇది చాలా పెద్ద సంఖ్యలో జనాభాకు ఉపాధి కల్పిస్తుంది.
రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు సమృద్ధిగా వర్షాలు కురిసినందున గత ఎలక్షన్లలో రైతుల మద్దతు కారణంగా పార్టీ రెండవసారి అధికారాన్ని నిలుపుకున్నట్లు BRS నాయకులు బలంగా భావిస్తున్నారు.