Posted in

Monkey pox : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు.. అప్రమత్తమైన కేంద్రం..

Monkey pox
Mpox Outbreak
Spread the love

Monkey pox : ప్ర‌స్తుతం మంకీపాక్స్ వైరస్ యావ‌త్‌ ప్రపంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్పటివరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాప్తి చెందిన‌ మంకీపాక్స్ ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది.. దిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు వెల్ల‌డించింది. మంకీపాక్స్ లక్షణాలతో అనుమానించిన కేసు.. Mpox (మంకీపాక్స్) పాజిటివ్‌గా గుర్తించిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉన్న‌ట్లు నిర్ధారించిందని తెలిపింది.
అయితే ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని.. అంతకు ముందు జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు వివ‌రించింది. ఈ వైరస్ ప‌ట్ల ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. WHO ప్రకారం.. mpox క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించింది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.

అప్రమత్తమైన కేంద్రం

Monkey pox వైర‌స్‌ సోకిన వ్యక్తి ని ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రోగి పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక‌ ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండ‌గా మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో భారత్ వెంట‌నే అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టులు, ఓడ‌రేవుల‌ ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా ప‌రీక్షించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు వీలుగా దేశంలో 32 ప్రత్యేక లాబ్ ల‌ను, ఐసోలేషన్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. మ‌రోవైపు రాష్ట్ర ప్రభుత్వాలను సైతం కేంద్రం అప్రమత్తం చేసింది..

ఎంపాక్స్ వైరస్ అంటే..?

మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తుల చేతులు కాళ్ల‌కు చిన్న చిన్న పొక్కులు ఏర్పడతాయి. చూడ్డానికి మశూచి (అమ్మ‌వారు) లక్షణాలతో ఉంటాయి. ఈ వైరస్ తొలిసారి 1958లో ఆఫ్రికాలో గుర్తించారు. ఈ వైరస్ జంతువుల ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను మొద‌ట‌ కోతుల్లో గుర్తించారు. అందుకే ఈవైర‌స్‌కు మంకీ పాక్స్ అనే పేరు వ‌చ్చింది. తొలి రోజుల్లో ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారి మాత్రమే ఈ వైర‌స్ సోకింది. వైరస్ పీడితులు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ కొన్ని కేసులు వ్యాప్తి చెందాయి. చాలా వరకు జంతువులు, వాటి మాంసం కారణంగానే వైరస్ వ్యాపి చెందింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *