జ‌మిలీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం.. వచ్చే పార్ల‌మెంట్‌ సమావేశాల్లోనే బిల్లు

జ‌మిలీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం.. వచ్చే పార్ల‌మెంట్‌ సమావేశాల్లోనే బిల్లు

One Nation One Election | దేశ‌వ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను నిర్వ‌హించేందుకు ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు మోదీ-కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జ‌మిలీ ఎన్నికల బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిషన్ ఈ ప్లాన్ ను ఆమోదించడంతో ఈ ప్రకటన వెలువడింది. గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జ‌మిటీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవ‌స‌రాన్ని వివ‌రించారు. దేశ‌వ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలోనే త‌ర‌చూ ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని, దీనివ‌ల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని తెలిపారు. ఇలాంటి స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు జ‌మిలీ ఎన్నిక‌లే స‌రైన ప‌రిష్కార‌మ‌ని వివ‌రించారు.

READ MORE  రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

ప్రస్తుత ఎన్డీయే ప్ర‌భుత్వ‌ హయాంలోనే జమిలి ఎన్నికలు అమ‌లు చేస్తామ‌ని ఇటీవ‌ల‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా కూడా స్పష్టంచేశారు. కాగా మోదీ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమలు చేయ‌నున్న‌ట్లు ప‌లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు కోవింద్‌ ‌కమిటీని వేసి నివేదిక రూపొందించారు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపింది. వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలోని కమిటీ అంద‌జేసిన నివేదికను కేబినెట్‌ ‌బుధవారం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనున్న‌ట్లు తెలుస్తోంది.

READ MORE  Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..

ఎనిమిది మంది స‌భ్యుల‌తో క‌మిటీ

కేంద్ర ప్ర‌భుత్వం జ‌మిలీ ఎన్నిక‌ల కోసం రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు (One Nation One Election) నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్‌నాథ్‌ ‌కోవింద్ విస్తృత‌ ‌చర్చ‌లు జ‌రిపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని రాజ‌కీయ‌ పార్టీల అభిప్రాయాలు, స‌ల‌హాలు, , రాష్ట్రాల నుంచి సవాళ్లను కమిటీ స‌మీక్షించింది. సుదీర్ఘ చర్చల త‌ర్వాత‌ రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

జమిలీ ఎన్నికల ప్రతిపాదన 1980లోనే వచ్చింది. జస్టిస్‌ ‌బీపీ జీవన్‌ ‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్‌ ‌మే 1999 లో తన 170 వ నివేదికలో లోక్‌సభ తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నికలు నిర్వ‌హించాల‌ని సూచించింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అధ్యయనానికి కమిటీ వేసి.. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న‌ది. అంతా సానుకూలంగా తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు సమాచారం.

READ MORE  Fourth Phase Election | నాలుగో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ADR నివేదికలో సంచ‌లన‌ విష‌యాలు..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *