Metro Rail Parking Fee | హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభ స్టేషన్లు నాగోల్, మియాపూర్‌లో ఉచిత వాహన పార్కింగ్‌కు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ముగింపు పలకబోతున్నది. నాగోల్ స్టేషన్‌లో ఇప్పటికే పార్కింగ్ ఫీజులను వసూలు చేయడం ప్రారంభించింది. గత బుధవారం వాహనాన్ని నిలిపేందుకు వెళ్లిన ప్రయాణికులకు రాత్రి సమయంలో అక్కడ కొత్త బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. పార్కింగ్ ఫీజులు చెల్లించాలనే బోర్డులో పేర్కొనడంతో స్టేషన్‌లో నిరసన చేపట్టారు. పార్కింగ్ వ్యవస్థల పని తీరును పరీక్షించేందుకు ట్రయల్స్ చేపట్టామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆ తర్వాత మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
బైకు రూ.40, కారుకు రూ.120
నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 25 నుంచి, మియాపూర్ స్టేషన్‌లో సెప్టెంబరు 1 నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ స్పష్టం చేసింది. అలాగే పార్కింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని పేర్కొంది.
Metro Rail Parking Fee : ద్విచక్రవాహనానికి మొదటి రెండు గంటలకు రూ.10 ధర నిర్ణయించింది. 8 గంటల వరకు రూ.25, అలాగే 12 గంటలకు రూ.40, ఆ తర్వాత ప్రతి గంటకు రూ.5 చొప్పున పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నారు. ఇక కారుకు మొదటి రెండు గంటలకు రూ.30 ఫీజు, 8 గంటల వరకు రూ.75, ఇక 12 గంటల వరకు రూ.120, ఆ తర్వాత గంటకు రూ.15 చొప్పున వసూలు చేస్తామని పేర్కొంది.
24 గంటల పాటు కారుకు రూ.300, బైక్‌కు రూ.100 చెల్లించాలని, నెల వారీ పాసులు తీసుకుంటే 40 శాతం రాయితీ ఉంటుందని మెట్రో సంస్థ తెలిపింది. హైటెక్ సిటీ మెట్రో మాల్‌లోనూ మొదట్లో ఉచిత పార్కింగ్ సదుపాయం ఉండేది. అక్కడ కూడా సంవత్సరంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. . ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని, ..పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు, సౌకర్యాల కోసం పార్కింగ్ ఫీజులను పర్మినెంట్‌గా డిస్ ప్లే చేస్తున్నామని ఎల్ అండ్ టీ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు సహకరించాలని వారు కోరారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..