Posted in

Manipur violence: అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా.. సోషల్ మీడియాలో కలకలం రేపిన ఫోటోలు

Spread the love

Manipur violence: జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు మణిపురి విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమావడం సంచలనం రేపింది.. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి..

ఒక చిత్రంలో ఇద్దరు విద్యార్థులు నేలపై కూర్చున్నట్లు చూపించారు, వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు కనిపిస్తున్నారు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో చిత్రంలో ఇద్దరు విద్యార్థులు విగతజీవులుగా  పడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.విద్యార్థులను 17 ఏళ్ల హిజామ్ లింతోంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్‌గా గుర్తించారు.

ఈ చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించిన తర్వాత, విద్యార్థుల కిడ్నాప్  హత్యకు పాల్పడిన వారందరిపై వేగంగా చర్యలు తీసుకుంటామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రజలకు హామీ ఇచ్చారు.

జులై 2023 నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులు ఫిజామ్ హేమ్‌జిత్, 20, హిజామ్ లింతోంగంబి (17)ల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ కేసును ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు.

“రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థల సహకారంతో.. విద్యార్థుల  అదృశ్యం హత్య  కేసును చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. నేరస్తులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు కూడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి” అని ఆ ప్రకటన పేర్కొంది. ప్రజలు సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి సచివాలయం తెలిపింది.

మణిపూర్ హింస

షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కోసం మీటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ ప్రాంతంలో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించినప్పుడు మే 3న జాతి హింస చెలరేగడంతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3,000 మందికి పైగా గాయపడ్డారు.

హింసను నియంత్రించడానికి.. రాష్ట్రంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి మణిపూర్ పోలీసులతో పాటు దాదాపు 40,000 మంది కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించారు.నాలుగు నెలల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది .

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *