మణిపూర్ : మూడు ఇళ్లను దగ్గం చేసి, భద్రతా దళాల ఆయుధాలను లాక్కెళ్లిన దుండగులు
manipur violence : మణిపూర్ లో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ పలుచోట్ల అవాంఛిత ఘటనలు చోటుచేసుకుంటుననాయి. తాజాగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని న్యూ లంబులనే ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు మూడు పాడుబడిన ఇళ్లను తగులబెట్టారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారని అధికారులు తెలిపారు.
సంఘటన జరిగిన వెంటనే, స్థానిక ప్రజలు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు., ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతించాలని డిమాండ్
చేయగా, రాష్ట్ర, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. తరువాత భద్రతా దళాలు గుంపును చెదరగొట్టడానికి కొన్ని రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్‌ను
ప్రయోగించాయని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి : మణిపూర్ అసలు చరిత్ర ఏమిటో మీకు తెలుసా..?
మరో ఘటనలో ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు మాజీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కె రాజో నివాసానికి కాపలాగా ఉన్న భద్రతా
సిబ్బంది నుంచి గుర్తుతెలియని వ్యక్తులు మూడు ఆయుధాలను లాక్కున్నారని పోలీసులు తెలిపారు.
ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని ఇంఫాల్ PS పరిధిలోని సగోల్‌బండ్ బిజోయ్ గోవింద వద్ద ఈ సంఘటన జరిగింది. దొంగిలించిన ఆయుధాలలో రెండు AK సిరీస్ రైఫిల్స్, ఒక కార్బైన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.