వీడియో: వరద ప్రవాహంలో వాహనం నడిపితే ఎంతో ప్రమాదమో చూడండి..
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకొకని పోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన విషాద సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వీడియోలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నారం గ్రామానికి చెందిన పి.మహేందర్ (32)గా గుర్తించారు. వాగు నుంచి నీరు పొంగి ప్రవహిస్తున్న రోడ్డు వెంబడి నెమ్మదిగా బైక్ నడుపుతుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయాడు. వేలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మహేందర్ కొట్టుకుపోగా, సాయంత్రం ప్రమాద స్థలానికి అరకిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని వెలికితీశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా అనేక నీటి వనరులు పొంగిపొర్లుతున్నాయి, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది.
Two separate incidents with bike in #Telangana:
In 1st video a man washed away with bike, while crossing overflowing Kannaram stream in #Hanumakonda dist.
In 2nd video he is lucky, rescued by locals at the Govindapuram stream in #Yadadri dist.#TelanganaRains #TelanganaFloods pic.twitter.com/dCAsQtq0DT— Surya Reddy (@jsuryareddy) July 27, 2023
Disaster Management Secretary రాహుల్ బొజ్జా ప్రకారం, జూలై 24 నుండి తెలంగాణలో వర్షాలు లేదా వరదల కారణంగా మంది మంది మృతి చెందారు. సహాయక చర్యల కోసం ఎనిమిది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను మోహరించామని, చిక్కుకుపోయిన వ్యక్తులను తరలించేందుకు రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు.
భూపాలపల్లి జిల్లా మోరనపల్లి గ్రామానికి చెందిన 600 మందిని, పెద్దపల్లి జిల్లా మంథని గోపాల్‌పూర్ సమీపంలో ఇసుక క్వారీలో చిక్కుకుపోయిన 19 మంది కార్మికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరనపల్లి గ్రామానికి చెందిన 1,900 మందిని పోలీసు సిబ్బందితో కలిసి ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. ఖమ్మంలోని మున్నేరు నదిలో గల్లంతైన ఏడుగురిని కూడా రక్షించారు. కాగా, వరంగల్, హన్మకొండ నగరాల్లో 200కు పైగా కాలనీలు జలమయమయ్యాయి.
జల భీభత్సం