Saturday, April 19Welcome to Vandebhaarath

అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. మరోచోట సజీవంగా దొరికాడు.

Spread the love

ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన

లక్నో: హత్యకు గురైన యువకుడి మృతదేహానికి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అతడు మరోచోట సజీవంగా కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ముజఫర్‌నగర్‌ (Muzaffarnagar)  జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఆగస్టు 31న 18 ఏళ్ల వయసున్న మోంటూ, అదే వయసు గల యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. అయితే తమ కుమార్తెను మోంటు
కిడ్నాప్ చేసినట్లు ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ జంట ఆచూకీ కనుగొనేందుకు పోలీస్ బృదాలను ఏర్పాటు చేశారు.

కాగా, సెప్టెంబర్ 13న మోంటూ కుటుంబ సభ్యులకు మీరట్‌ (Meerut) పోలీసులు ఫోన్ చేశారు. కాలువలో తల లేని యువకుడి మృతదేహం లభ్యమైందని దానిని గుర్తించాలని పిలిపించారు. దీంతో వెంటనే మార్చురీకి తల్లిదండ్రులు వెళ్లారు. మృతదేహంపై టాటూను చూసి ఆ మృతదేహం మోంటుదేనని వారు చెప్పారు. బుధవారం రాత్రి మృతదేహంతో ముజఫర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. తమ కుమారుడిని యువతి కుటుంబ సభ్యులే హత్యచేశారని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక గురువారం ఆ మృతదేహానికి అంత్యక్రియలు
నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు.

READ MORE  Nitish Kumar : 9వసారి సీఎం అయిననితీష్ కుమార్.. బీహార్ లో కీలక పరిణామాలు

ఇంతలోనే మోంటు, ఆ యువతి ఇద్దరూ చండీగఢ్‌ (Chandigarh)లో ఉన్నారని ముజఫర్‌నగర్‌ పోలీసులకు తెలిసింది. వెంటనే ఆ సమాచారాన్ని అతని కుటుంబ సభ్యులకు చేరవేశారు. దీంతో అప్పటివరకు తమ కుమారుడిదిగా భావించిన మృతదేహానికి అంత్యక్రియలను మోంటు కుటుంబ సభ్యులు నిలిపివేశారు. అయితే తల లేని ఆ మృతదేహం ఎవరిది? మోంటూగా అతడి తల్లిదండ్రులు ఎందుకు పొరబడ్డారు అన్న అంశాలపై మీరట్‌ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.

READ MORE  వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ విజయవంతం

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *